ప్రియుడా ప్రభు యేసునకు - YouWorship
Priyudaa Prabhu Yesunaku
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: ప్రియుడా ప్రభు యేసునకు - నీ వీనుల నిమ్ము (1) ప్రియుడా ప్రభు యేసునకు - విశాల స్థలమిమ్ము (1) ప్రియుడా ప్రభు యేసునకు - విస్తార ఫలమిమ్ము (1) 1. సర్వాధికారియైన యేసు - సర్వశక్తి గలవాడు (2) సర్వజనులలోన - శిష్యుల జేయుమనెన్ (2) 2. జనముల నీదు స్వాస్థ్యముగ - భూమి దిగంతముల వరకు నన్నడుగుడి మీదు సొత్తు - గా నిచ్చెదననెన్ 3. పర్వతముల నీవు యెక్కి - మ్రానులను కొట్టి తెచ్చి మందిరము కట్టిన - మది నుల్లసింతుననెన్ 4. కోత సమయమింక కొంత - కాలమున్నదనేదంత తెల్లబారిన పొలముల్ - కన్నుల గాంచుమనెన్ 5. ప్రతివాడు తన స్వంత పనులే - చింత గలిగి చేసెదరిలలో ప్రభు యేసు పనులన్ నీవు - పాటింప కుండెదవా 6. నీ దేహమును నీది కాదు - విలువపెట్టి కొన్నాడేసు నీ దేహమాయన కిమ్ము - సజీవ యాగముగ 7. ప్రతివాని పనుల పరికించి - ఫలము నియ్య ప్రభుడిలకొచ్చున్ ప్రతిచోట నీవు ఫలముల్ - ఫలించుచుండు మిలన్ Pallavi: Priyudaa Prabhu Yesunaku - Nee Veenula Nimmu (1) Priyudaa Prabhu Yesunaku - Vishaala Sthalamimmu (1) Priyudaa Prabhu Yesunaku - Visthaara Phalamimmu (1) 1. Sarvaadhikaariyaina Yesu - Sarvashakthi Galavaadu (2) Sarvajanulalona - Shishyula Jeyumanen (2) 2. Janamula Needu Svaasthyamuga - Bhoomi Diganthamula Varaku Nannadugudi Meedu Soththu - Gaa Nichchedananen 3. Parvathamula Neevu Yekki - Mraanulanu Kotti Thechchi Mandiramu Kattina - Madi Nullasinthunanen 4. Kotha Samayamingka Kontha - Kaalamunnadanedantha Thellabaarina Polamul - Kannula Gaanchumanen 5. Prathivaadu Thana Svantha Panule - Chintha Galigi Chesedarilalo Prabhu Yesu Panulan Neevu - Paatimpa Kundedavaa 6. Nee Dehamunu Needi Kaadu - Viluvapetti Konnaadesu Nee Dehamaayana Kimmu - Sajeeva Yaagamuga 7. Prathivaani Panula Parikinchi - Phalamu Niyya Prabhudilakochchun Prathichota Neevu Phalamul - Phalinchuchundu Milan