ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా - YouWorship
Praarthana Vinedu Devaa Praarthinchumanina Prabhuvaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా (1) స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితిమి మముజూడు (2) 1. పొందిన మేలుల మరచి మందిర సమృద్దిన్ విడచి (2) పొందితిమిలలో బాధల్ నిందను తెచ్చితిమయ్యా (2) 2. ఒప్పుకొనుచుంటి మిలలో మా పితరులవలె మేము అపవిత్రులమై నీదు కోపము రేపితిమయ్యా 3. ఇరుకున పడియుంటిమి పరులెల్లరు మముజూచి పరిహాసమును చేయ తరుణము నిచ్చితిమయ్యా 4. ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా త్రోసివేయని మా దేవా నీ చెంత జేరితిమయ్యా 5. నీ ముఖమును దాచకుము నీ మార్గమును నేర్పించు నింపునీయాత్మనుమాలో సంపూర్ణులుగా జేయుమయ్యా Pallavi: Praarthana Vinedu Devaa Praarthinchumanina Prabhuvaa (1) Svaarthamunellanu Drosi Dari Cherithimi Mamujoodu (2) 1. Pondina Melula Marachi Mandira Samruddin Vidachi (2) Pondithimilalo Baadhal Nindanu Thechchithimayyaa (2) 2. Oppukonuchunti Milalo Maa Pitharulavale Memu Apavithrulamai Needu Kopamu Repithimayyaa 3. Irukuna Padiyuntimi Parulellaru Mamujoochi Parihaasamunu Cheya Tharunamu Nichchithimayyaa 4. Aashinchithimi Ninnu Shaashvatha Krupagala Devaa Throsiveyani Maa Devaa Nee Chentha Jerithimayyaa 5. Nee Mukhamunu Daachakumu Nee Maargamunu Nerpinchu Nimpuneeyaathmanumaalo Sampoornulugaa Jeyumayyaa