ప్రాణమా నా ప్రాణమా - YouWorship
Praanamaa Naa Praanamaa
Artist: దియ్యా ప్రసాద రావు
Category: Thanksgiving
Song Lyrics
ప్రాణమా నా ప్రాణమా ప్రియ యెహోవాను సన్నుతించుమా ప్రియ యెహోవా చేసిన మేలులను నీవు ఎన్నడు మరువకుమా ||ప్రాణమా|| గత కాలములన్నిటిలో కృపతోనే నడిపించెను (2) కరుణ కటాక్షమనే (2) కిరీటం నీకు దయచేసెను (2) ||ప్రాణమా|| నిను విడువక ఎడబాయక నిత్యం నీకు తోడైయుండెను (2) నీవు నడిచిన మార్గములో (2) నీకు దీపమై నిలచెనుగా (2) ||ప్రాణమా|| పాప శాపము వ్యాధులను పారద్రోలియే దీవించెను (2) పరిశుద్ధుడు పరమ తండ్రి (2) బలపరిచెను తన కృపతో (2) ||ప్రాణమా|| మహా ఆనంద మానందమే మహారాజా నీ సన్నిధిలో (2) మహిమగల మహారాజా (2) మనసారా స్తుతించెదను (2) ||ప్రాణమా|| Praanamaa Naa Praanamaa Priya Yehovaanu Sannuthinchumaa Priya Yehovaa Chesina Melulanu Neevu Ennadu Maruvakumaa ||Praanamaa|| Gatha Kaalamulannitilo Krupathone Nadipinchenu (2) Karuna Kataakshamane (2) Kireetam Neeku Dayachesenu (2) ||Praanamaa|| Ninu Viduvaka Edabaayaka Nithyam Neeku Thodaiyundenu (2) Neevu Nadichina Maargamulo (2) Neeku Deepamai Nilachenugaa (2) ||Praanamaa|| Paapa Shaapamu Vyaadhulanu Paaradroliye Deevinchenu (2) Parishudhdhudu Parama Thandri (2) Balaparichenu Thana Krupatho (2) ||Praanamaa|| Mahaa Aananda Maanandame Mahaaraajaa Nee Sannidhilo (2) Mahimagala Maharaajaa (2) Manasaaraa Sthuthinchedanu (2) ||Praanamaa||