ప్రవిమలుడా పావనుడా స్తుతిస్తోత్రము నీకే - YouWorship
Pravimaludaa Paavanudaa SthuthiSthothramu Neeke
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రవిమలుడా పావనుడా - స్తుతిస్తోత్రము నీకే (2) పరమునుండి ప్రవహించె - మాపై కృప వెంబడి కృపలు (1) 1. నీ మందిర సమృద్ధివలన - తృప్తిపరచు చున్నావుగా (2) ఆనంద ప్రవాహ జలమును (2) - మాకు త్రాగనిచ్చితివి (1) కొనియాడెదము నీ కృపకై - ఆనందించుచు పాడెదము (2) 2. దేవుని సంపూర్ణతలో మమ్ము - పరిశుద్ధులుగా జేసియున్నావు జ్ఞానమునకు మించిన ప్రేమ - మాలో బయలు పరచితివి కృతజ్ఞతలు చెల్లించుచు - పూజించెదము నిన్నెప్పుడు 3. దైవత్వము నిండి యుండెనుగా - క్రీస్తు యేసు ప్రభువునందు ఆయనయందు సంపూర్ణులుగా - మమ్ము జేసియున్నావు సాగిలపడుచు నీ కృపకై - ఆరాధింతుము నిన్నిలలో 4. నిర్ధోషులుగా నిరపరాధులుగా - నీ రక్తముతో మము జేసితివి సర్వసంపూత్ణత మాకిచ్చి - సిలువలో సంధిజేసితివి నిత్యము నిన్ను స్తుతించి - ఘనపరచెదము నిన్నిలలో 5. కృపా సత్యసంపూర్ణుడవై - మామధ్యలో నివసించితివి లోకమునందు నమ్మబడితివి - అద్వితీయ తనయుడవై నిరతము నిన్ను కీర్తించి - సమాజములో పాడెదము Pallavi: Pravimaludaa Paavanudaa - SthuthiSthothramu Neeke (2) Paramunundi Pravahinche - Maapai Krupa Vembadi Krupalu (1) 1. Nee Mandira Samruddhivalana - Thrupthiparachu Chunnaavugaa (2) Aananda Pravaaha Jalamunu (2) - Maaku Thraaganichchithivi (1) Koniyaadedamu Nee Krupakai - Aanandinchuchu Paadedamu (2) 2. Devuni Sampoornathalo Mammu - Parishuddhalugaa Jesiyunnaavu Gnaanamunaku Minchina Prema - Maalo Bayalu Parachithivi Kruthagnathalu Chellinchuchu - Poojinchedamu Ninneppudu 3. Daivathvamu Nindi Yundenugaa - Kreesthu Yesu Prabhuvunandu Aayanayandu Sampoornulugaa - Mammu Jesiyunnaavu Saagilapaduchu Nee Krupakai - Aaraadhinthumu Ninnilalo 4. Nirdhoshulugaa Niraparaadhulugaa - Nee Rakthamutho Mamu Jesithivi Sarvasampoothnatha Maakichchi - Siluvalo Sandhijesithivi Nithyamu Ninnu Sthuthinchi - Ghanaparachedamu Ninnilalo 5. Krupa Sathyasampoornudavai - Maamadhyalo Nivasinchithivi Lokamunandu Nammabadithivi - Advitheeya Thanayudavai Nirathamu Ninnu Keerthinchi - Samaajamulo Paadedamu