ప్రభూ నీ వాడను నీవు - YouWorship
Prabhoo Nee Vaadanu Neevu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: 1. ప్రభు వా యెరిగితిని లోకమంత మోసమని (2) చూపితివి సమాధాన నిరీక్షణ నా కిలలో (2) కృతజ్ఞత కలిగి (2) - నీవైపే చూచెదను (1) నీయందే నిలిచి యుండి నీయాజ్ఞల పాలింతును (2) 2. నా ముందు నడిచే ప్రభూ నిన్ను వెంబడించెదను నీవు నా తోడనుండ మరచెదను దుఃఖమును నెమ్మదిని పొంది యిల - కన్నీరు కార్చనిక నీవే నా సర్వమని నీయందే బలపడెద 3. యేసుని సిలువజూచి విజయమును పొందెదను సహింతును సంతసముగ నీ కొరకు అన్నింటిని నిన్ను నే నమ్మెదను - నీతోనే సాగెదను నీ రెక్కలచాటు నేనుండ భయపడను 4. మరణనది యొద్దకు సంతసముగ వచ్చెదను మృత్యువు బారినుండి జీవమునకు దాటింతువు రక్షకుని చూచెదను - నన్నాయన చేర్చుకొనున్ తక్షణమే తన రూపమునకు మార్పుచెందెదను 5. అగమ్య జ్యోతియందు ఘనముగ నే ప్రవేశించి దూతలు, పరిశుద్ధులు, భక్తులనే చూచెదను నే సంతసించెదను - ప్రభువుతోడ నుండెదను నిరీక్షణ యిదియే ఆయనతో నేనుందును Pallavi: 1. Prabhu Vaa Yerigithini Lokamantha Mosamani (2) Choopithivi Samaadhaana Nireekshana Naa Kilalo (2) Kruthagnatha Kaligi (2) - Neevaipe Choochedanu (1) Neeyande Nilichi Yundi Neeyaagnala Paalinthunu (2) 2. Naa Mundu Nadiche Prabhoo Ninnu Vembadinchedanu Neevu Naa Thodanunda Marachedanu Duhkhamunu Nemmadini Pondi Yila - Kanneeru Kaarchanika Neeve Naa Sarvamani Neeyande Balapadeda 3. Yesuni Siluvajoochi Vijayamunu Pondedanu Sahinthunu Santhasamuga Nee Koraku Annintini Ninnu Ne Nammedanu - Neethone Saagedanu Nee Rekkalachaatu Nenunda Bhayapadanu 4. Marananadi Yoddaku Santhasamuga Vachchedanu Mruthyuvu Baarinundi Jeevamunaku Daatinthuvu Rakshakuni Choochedanu - Nannaayana Cherchukonun Thakshaname Thana Roopamunaku Maarpuchendedanu 5. Agamya Jyothiyandu Ghanamuga Ne Praveshinchi Doothalu, Parishuddhalu, Bhakthulane Choochedanu Ne Santhasinchedanu - Prabhuvuthoda Nundedanu Nireekshana Yidiye Aayanatho Nenundunu