ప్రభు యేసు ప్రభు యేసు - YouWorship
Prabhu Yesu Prabhu Yesu
Artist: Unknown Artist
Category: Good Friday
Song Lyrics
ప్రభు యేసు.. ప్రభు యేసు – అదిగో శ్రమ నొందెను ఖైదీలను విడిపించెను సిలువలో || ప్రభు యేసు || ఎంత కౄరమో.. ఎంత కౄరమో – శత్రు కార్యము చూడుమా అంతగా బాధించి సిలువమీది కెత్తిరి బాధనొందియు.. బాధనొందియు – ఎదురు మాటలాడక ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు || ముండ్ల మకుటము.. ముండ్ల మకుటము – తన తల నుంచిరి మూర్ఖుల దెబ్బల బాధను సహించెను మూసియుండిన.. మూసియుండిన మోక్షద్వారము తెరచి ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు || ఆత్మదేవుడు.. ఆత్మదేవుడు – ప్రత్యక్షంబాయె సిలువలో సూర్యుడదృశ్యుడై క్రమ్మెనంత చీకటి సార్వత్రికము.. సార్వత్రికము – గడగడ వణికెను ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు || మరణించెను.. మరణించెను – సమాధి నుంచబడెను మూడవనాడు సమాధినుండి లేచెను విడిపించెను.. విడిపించెను మరణ బంధితులను ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు || తీసివేసెను.. తీసివేసెను – నా పాప నేరమంతయు దేవయని ప్రభు అరచిన యపుడు దేవుని దయ.. దేవుని దయ – కుమ్మరించబడెను ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభుయేసు || కారు చీకటిలో.. కారు చీకటిలో – దుఃఖంబులో నేనుంటిని నీకువేరుగా నారక్షణిల లేదుగా నాదు శ్రమలు.. నాదు శ్రమలు – వేరెవ్వరు నెరుగరు ఖైదీలను విడిపించెను సిలువలో (2) || ప్రభు యేసు || Prabhu Yesu.. Prabhu Yesu – Adigo Shrama Nondenu Khaideelanu Vidipinchenu Siluvalo ||Prabhu Yeshu|| Entha Krooramo.. Entha Krooramo.. Shathru Kaaryamu Chooduma Anthaga Baadhinchi Siluvameedi Ketthiri Baadhanondiyu.. Baadhanondiyu – Eduru Maatalaadaka Khaideelanu Vidipinchenu Siluvalo (2) ||Prabhu Yeshu|| Mundla Makutamu.. Mundla Makutamu – Thana Thala Nunchiri Moorkhula Debbala Baadhanu Sahinchenu Moosiyundina.. Moosiyundina Mokshadwaaramu Therachi Khaideelanu Vidipinchenu Siluvalo (2) ||Prabhu Yeshu|| Aathmadevudu.. Aathmadevudu – Prathyakshambaaye Siluvalo Sooryudadrushyudai Krammenantha Cheekati Saarvathrikamu.. Saarvathrikamu – Gadagada Vanikenu Khaideelanu Vidipinchenu Siluvalo (2) ||Prabhu Yeshu|| Maraninchenu.. Maraninchenu – Samaadhi Nunchabadenu Moodavanaadu Samaadhinundi Lechenu Vidipinchenu.. Vidipinchenu Marana Bandhithulanu Khaideelanu Vidipinchenu Siluvalo (2) ||Prabhu Yeshu|| Theesivesenu.. Theesivesenu – Naa Paapa Neramanthayu Devayani Prabhu Arachina Yapudu Devuni Daya.. Devuni Daya – Kummarinchabadenu Khaideelanu Vidipinchenu Siluvalo (2) ||Prabhu Yeshu|| Kaaru Cheekatilo.. Kaaru Cheekatilo – Dukhambulo Nenuntini Neeku Verugaa Naa Rakshanila Ledugaa Naadu Shramalu.. Naadu Shramalu – Verevvaru Nerugaru Khaideelanu Vidipinchenu Siluvalo (2) ||Prabhu Yeshu||