ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా - YouWorship
Prabhu Yesu Pilupunu O Priyudaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా - పెడచెవిని పెట్టెదవా (1) తీర్మానము చేయకనే వెళ్ళెదవా - ప్రభుసన్నిధిలో నుండి (2) 1. లేత వయస్సు నడిప్రాయమును - గతించి పోవునవి (2) మన్నయినది వెనుకటివలెనే - మరల భూమికి చేరున్ (2) ఆత్మదాని దయచేసిన - దేవుని యొద్దకు పోవున్ (2) ఆ లోకములో నీ ముందుగతి ఏమౌనో ఎరిగితివా (2) 2. ఏపాటిది నీ జీవితమంత - ఏపాటిది నీ తనువు గడ్డిపువ్వుతో సమమిదియేరా - అదియే నీ జీవితము అంతలోన మాయము అగు - వింత బుడగయే కాదా అంతలోన అంతర్థానంబగు ఆవిరియేకాదా 3. వ్యర్థము వ్యర్థము సర్వము యిలలో - ఇదియే యేసుని మాట నిలువని నీడ యీ లోకమురా - కలుషాత్మ కనుగొనరా లోకమంత సంపాదించి - లోభీ నీ ప్రాణమును నష్టపరచుకొనిన నీకు నరుడా లాభముకలదా 4. తామసించ తగదిక నీకు - తక్షణమే తిరుగుమురా విరిగి నలిగి హృదయము కరిగి - వినయముతో ప్రభు జేరి యేసు ప్రభుని సిలువచెంత - యేసుని రక్తముకోరి ప్రలాపించి నీదు సకల పాపము నొప్పుకొనుమా 5. నీ రక్షణకై నిలిచెను యేసు - తన రక్తధారలతో కడుగును నిన్ను క్షమించును - వడిగా యీ క్షణమందే నీ నామమును పరలోకములో - నేడే వ్రాసి యుంచున్ రక్షణానందముతో నిప్పుడే రంజిల్లెదవు ప్రియుడా Pallavi: Prabhu Yesu Pilupunu O Priyudaa - Pedachevini Pettedavaa (1) Theermaanamu Cheyakane Velledavaa - Prabhusannidhilo Nundi (2) 1. Letha Vayassu Nadipraayamunu - Gathinchi Povunavi (2) Mannayinadi Venukativalene - Marala Bhoomiki Cherun (2) Aathmadaani Dayachesina - Devuni Yoddaku Povun (2) Aa Lokamulo Nee Mundugathi Emauno Erigithivaa (2) 2. Epaatidi Nee Jeevithamantha - Epaatidi Nee Thanuvu Gaddipuvvutho Samamidiyeraa - Adiye Nee Jeevithamu Anthalona Maayamu Agu - Vintha Budagaye Kaadaa Anthalona Antharthaanambagu Aaviriyekaadaa 3. Vyarthamu Vyarthamu Sarvamu Yilalo - Idiye Yesuni Maata Niluvani Needa Yee Lokamuraa - Kalushaathma Kanugonaraa Lokamantha Sampaadinchi - Lobhee Nee Praanamunu Nashtaparachukonina Neeku Narudaa Laabhamukaladaa 4. Thaamasincha Thagadika Neeku - Thakshaname Thirugumuraa Virigi Naligi Hrudayamu Karigi - Vinayamutho Prabhu Jeri Yesu Prabhuni Siluvachentha - Yesuni Rakthamukori Pralaapinchi Needu Sakala Paapamu Noppukonumaa 5. Nee Rakshanakai Nilichenu Yesu - Thana Rakthadhaaralatho Kadugunu Ninnu Kshaminchunu - Vadigaa Yee Kshanamande Nee Naamamunu Paralokamulo - Nede Vraasi Yunchun Rakshanaanandamutho Nippude Ranjilledavu Priyudaa