ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము - YouWorship
Prabhu YesuKreesthu Aishvaryamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రభు యేసుక్రీస్తు ఐశ్వర్యము - శోధింప శక్యముగానిది యుగ యుగముల నుండి - తరతరములనుండి - (2) మరుగైయున్నట్టి మర్మము - (2) 1. దేవుని కృపామహాదైశ్వర్యమే - పాపక్షమాపణ మనకిచ్చెను ఆయన దయాసంకల్పమే - మనలను స్వాస్థ్యముగా చేసెను హల్లెలూయా - హల్లెలూయా- హల్లెలూయా - హల్లెలూయా 2. ఐశ్వర్య వంతుడు మనయేసు - దరిద్రుడాయెను మనకొరకే రిక్తునిగా తన్ను చేసికొనన్ - పరమును వీడి నరుడాయెను హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా 3. అల్పులము మనలను ప్రేమించెను - సంఘములో అంగములగాజేసెను నీ ప్రేమ ఐశ్వర్యమంత గొప్పది - వివరింప మాకు బుద్ధిచాలదే హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా 4. ఒక్కప్రభువే అందరికి ప్రభువై - తనను ప్రార్ధించు వారందరికీ యూదులని గ్రీకులని భేదములేక - ఐశ్వర్యవంతుడు కృపచూపను హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా 5. దరిద్రులముగా నెంచబడితిమి - లోకమునకైశ్వర్యమిచ్చు చుంటిమి యేమియులేని వారమైనను - సమస్తమును కలిగియున్న వారము హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా 6. చిక్కులన్ని తొలగించి దరిచేర్చి - ఒక్కటిగా సంఘమును సమకూర్చి దిక్కుగా నుండి కాపాడుచుంటివి - మ్రొక్కుబడి చెల్లించి ఆరాధింతుము హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా 7. వచ్చుచున్న మన యేసు శక్తిమంతుడు - ఐశ్వర్యజ్ఞాన బలములాయనకే మహిమ ఘనత స్తుతిస్తోత్రముల్ - యుగయుగములాయనకే హల్లెలూయ హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా Pallavi: Prabhu YesuKreesthu Aishvaryamu - Shodhimpa Shakyamugaanidi Yuga Yugamula Nundi - Tharatharamulanundi - (2) Marugaiyunnatti Marmamu - (2) 1. Devuni Krupamahaadaishvaryame - Paapakshamaapana Manakichchenu Aayana Dayaasangkalpame - Manalanu Svaasthyamugaa Chesenu Hallelooyaa - Hallelooyaa- Hallelooyaa - Hallelooyaa 2. Aishvarya Vanthudu ManaYesu - Daridrudaayenu Manakorake Rikthunigaa Thannu Chesikonan - Paramunu Veedi Narudaayenu Hallelooyaa - Hallelooyaa - Hallelooyaa - Hallelooyaa 3. Alpulamu Manalanu Preminchenu - Sangghamulo Anggamulagaajesenu Nee Prema Aishvaryamantha Goppadi - Vivarimpa Maaku Buddhichaalade Hallelooyaa - Hallelooyaa - Hallelooyaa - Hallelooyaa 4. OkkaPrabhuve Andariki Prabhuvai - Thananu Praardhinchu Vaarandarikee Yoodulani Greekulani Bhedamuleka - Aishvaryavanthudu Krupachoopanu Hallelooyaa - Hallelooyaa - Hallelooyaa - Hallelooyaa 5. Daridrulamugaa Nenchabadithimi - Lokamunakaishvaryamichchu Chuntimi Yemiyuleni Vaaramainanu - Samasthamunu Kaligiyunna Vaaramu Hallelooyaa - Hallelooyaa - Hallelooyaa - Hallelooyaa 6. Chikkulanni Tholaginchi Daricherchi - Okkatigaa Sangghamunu Samakoorchi Dikkugaa Nundi Kaapaaduchuntivi - Mrokkubadi Chellinchi Aaraadhinthumu Hallelooyaa - Hallelooyaa - Hallelooyaa - Hallelooyaa 7. Vachchuchunna Mana Yesu Shakthimanthudu - Aishvaryagnaana Balamulaayanake Mahima Ghanatha SthuthiSthothramul - Yugayugamulaayanake Hallelooya Hallelooyaa - Hallelooyaa - Hallelooyaa - Hallelooyaa