ప్రభు యేసుక్రీస్తుని దర్శనమే నేడు - YouWorship
Prabhu YesuKreesthuni Darshaname Nedu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రభు యేసుక్రీస్తుని దర్శనమే నేడు (1)- ప్రజలందరి కత్యవసరము ఆ ఆ (2) అను పల్లవి: దర్శనము లేక ప్రజలు నశింతురు (1) - దీనినక్కరతో గమనించెదము (2) 1. యెషయాచూచె సైన్యముల యెహోవాను (1)- ఉజ్జియా మరణించినపుడు ఆ ఆ (2) యెహోవా పరిశుద్ధుడని ముమ్మారు (1) దూతల గొప్ప ద్వని వినెనపుడు (2) 2. యెహెజ్కేలుకు అధిపతివలె కనబడె - నా భాగ్యమెవరికి లేదా నాళు ముఖములతో నాలుగు జీవులు కన్నులతో నిండియున్న చక్రములు 3. శాశ్వత రాజ్యములు కల్గిన రాజును - అగ్నివంటి సింహాసనమున్ కోట్లకొలది జనులు తీర్పునకై కాచియుండుట చూచెను దానియేలు 4. కొండపై యేసు రూపాంతర మొందిన - సందర్భము మరువగలమా భయ మొందిరచ్చట ముగ్గురు శిష్యుల్ ప్రియసుతుని గూర్చి తండ్రి జెప్పగనె 5. పత్మాసు ద్వీపమున యోహానుజూచిన - ప్రభువే సంఘమునకు శిరస్సు మహా ప్రధాన యాజకుడాయనే మహిమ ప్రభావ రూపుడు యేసే 6. సింహసనము మధ్యలో నున్నవాడే - సింహమగు దైవ గొఱ్ఱెపిల్ల ఆరాధింపబడు దేవుడు నాయనే అందరి యారాధన లాయనకే 7. తెల్లని యశ్వముపై నున్న వీరుడు - నమ్మకమగు సత్యరూపి దేవుని వాక్యము న్యాయాధీపతియగు జీవుల దేవునికే హల్లెలూయ Pallavi: Prabhu YesuKreesthuni Darshaname Nedu (1)- Prajalandari Kathyavasaramu Aa Aa (2) Anu Pallavi: Darshanamu Leka Prajalu Nashinthuru (1) - Deeninakkaratho Gamaninchedamu (2) 1. Yeshayaachooche Sainyamula Yehovaanu (1)- Ujjiyaa Maraninchinapudu Aa Aa (2) Yehovaa Parishuddhadani Mummaaru (1) Doothala Goppa Dvani Vinenapudu (2) 2. Yehejkeluku Adhipathivale Kanabade - Naa Bhaagyamevariki Ledaa Naalu Mukhamulatho Naalugu Jeevulu Kannulatho Nindiyunna Chakramulu 3. Shaashvatha Raajyamulu Kalgina Raajunu - Agnivanti Sinhaasanamun Kotlakoladi Janulu Theerpunakai Kaachiyunduta Choochenu Daaniyelu 4. Kondapai Yesu Roopaanthara Mondina - Sandarbhamu Maruvagalamaa Bhaya Mondirachchata Mugguru Shishyul Priyasuthuni Goorchi Thandri Jeppagane 5. Pathmaasu Dveepamuna Yohaanujoochina - Prabhuve Sangghamunaku Shirassu Mahaa Pradhaana Yaajakudaayane Mahima Prabhaava Roopudu Yese 6. Sinhasanamu Madhyalo Nunnavaade - Sinhamagu Daiva Gorrepilla Aaraadhimpabadu Devudu Naayane Andari Yaaraadhana Laayanake 7. Thellani Yashvamupai Nunna Veerudu - Nammakamagu Sathyaroopi Devuni Vaakyamu Nyaayaadheepathiyagu Jeevula Devunike Hallelooya