ప్రభు ప్రజలారా రయమున రండి - YouWorship
Prabhu Prajalaaraa Rayamuna Randi
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: ప్రభు ప్రజలారా - రయమున రండి (1) యాకోబు వంశమా - స్వకీయ జనమా (1) యెహోవా వెలుగులో - నడుతము రండి (2) 1. అంత్య దినములందు - పొంతన లేనట్టి (2) మందిర పర్వత - శోభను గాంచగ (2) ఉన్నత పర్వత - శిఖరమందుండి (2) మహిమతో యిమ్మహి - వర్థిల్లును (2) 2. యెహోవా మందిర - మందున బోధించు హితబోధను విని - తన త్రోవ నడువగ యాకోబు దేవుని - నివాసమునకు పంక్తులై జనులు - పరుగిడి వత్తురు 3. యెహోవా వంతు ఆయన జనమే యాకోబే తన - స్వాస్థ్యం బాయెన్ భీకర యెడారిలో - కనుగొనె వానిని ఎంచెను కాచెను - కనుపాపగను 4. కమనీయంబగు - కలకని యాకోబు గాంచెను నిచ్చెనన్ - భువినుండి దివికి నిలువగ యెహోవా - దానికి పైగా బేతేలే యిది - వేరేది కాదనెన్ 5. దేవుని మందిర - ప్రత్యక్షతలు సజీవ్ సంఘ - మందున నింపెన్ సత్యమునకు నిది - ఆధారమును స్తంభము గానై - స్థిరముగ నుండెను 6. నూతనమైనట్టి - యెరూషాలే మది నిత్య దేవుని - నివాసమాయె భక్తులు చేరి - ప్రస్తుతింపగ స్తుతులకు మధ్యను - ప్రభవించును ప్రభు 7. కుక్కలు మాంత్రికులు - వ్యభిచారులును నరహంతకులును - విగ్రహారాధికులు అబద్ధమును ప్రేమించి - జరిగించు ప్రతివాడునట - వెలుపట నుందురు 8. సర్ప సంతానము నుండి - వేరైనవారై క్రీస్తుని రక్తమున్ - కోరి వేడినచో స్వకీయ ధనమౌ - యాకోబు వంశమై కీర్తింతురు ప్రభున్ - హల్లెలూయ Pallavi: Prabhu Prajalaaraa - Rayamuna Randi (1) Yaakobu Vanshamaa - Svakeeya Janamaa (1) Yehovaa Velugulo - Naduthamu Randi (2) 1. Anthya Dinamulandu - Ponthana Lenatti (2) Mandira Parvatha - Shobhanu Gaanchaga (2) Unnatha Parvatha - Shikharamandundi (2) Mahimatho Yimmahi - Varthillunu (2) 2. Yehovaa Mandira - Manduna Bodhinchu Hithabodhanu Vini - Thana Throva Naduvaga Yaakobu Devuni - Nivaasamunaku Pangkthulai Janulu - Parugidi Vaththuru 3. Yehovaa Vanthu Aayana Janame Yaakobe Thana - Svaasthyan Baayen Bheekara Yedaarilo - Kanugone Vaanini Enchenu Kaachenu - Kanupaapaganu 4. Kamaneeyambagu - Kalakani Yaakobu Gaanchenu Nichchenan - Bhuvinundi Diviki Niluvaga Yehovaa - Daaniki Paigaa Bethele Yidi - Veredi Kaadanen 5. Devuni Mandira - Prathyakshathalu Sajeev Sanggha - Manduna Nimpen Sathyamunaku Nidi - Aadhaaramunu Sthambhamu Gaanai - Sthiramuga Nundenu 6. Noothanamainatti - Yerooshaale Madi Nithya Devuni - Nivaasamaaye Bhakthulu Cheri - PraSthuthimpaga Sthuthulaku Madhyanu - Prabhavinchunu Prabhu 7. Kukkalu Maanthrikulu - Vyabhichaarulunu Narahanthakulunu - Vigrahaaraadhikulu Abaddhamunu Preminchi - Jariginchu Prathivaadunata - Velupata Nunduru 8. Sarpa Santhaanamu Nundi - Verainavaarai Kreesthuni Rakthamun - Kori Vedinacho Svakeeya Dhanamau - Yaakobu Vanshamai Keerthinthuru Prabhun - Hallelooya