ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకాలో చూతురు - YouWorship
Prabhu Dayacheyu Nithya Deevenalu Beraakaalo Choothuru
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: ప్రభు దయచేయు - నిత్య దీవెనలు బెరాకాలో చూతురు (2) 1. కీడు, యుద్ధము, తెగులు, కరువైనను - దాడి చేయబూని విజృంభించి నపుడు (2) నీవు మొరపెట్టిన నీకు దొరుకు - నిజముగా - రక్షణ (2) 2. శత్రు శోధనలు పై బడినప్పుడు - శక్తిహీనులమై పోయినప్పుడు క్రీస్తు దయచేయు నిత్యాదరణ - నిజముగా - చూతురు 3. ప్రభు యుద్ధము చేయు నాయకుడు - ప్రభు పక్షమందు చేరుము యీనాడే నీవు పొందెదవు బెరాకాలో - నిజముగా - జయము 4. పలువిధ శ్రమలందు చేరుమా - ప్రీతిమీర మిమ్ము దరిచేర్చును నీతియుక్తముగా స్తుతించుము - ఖ్యాతితో ప్రభుని 5. నిత్యదేవుని మహాకృప నిరతం - శత్రువును జయించును నిశ్చయం కృతజ్ఞతా స్తుతులు మీరు - నిత్యముగా చెల్లించుడి 6. స్వరమండల సితారా వాయించుడి - శత్రువులతో ప్రభు పోరుసల్పెను బెరాకాలో ప్రభు స్వరమెత్తి - మరి మరి - పాడుడి 7. పరమ తండ్రి ప్రసాదించు నెమ్మది - భూరాజులు గడగడ వణికిరి తన ప్రజలను సంతోషపరచును - హల్లెలూయ - పాడుడి Pallavi: Prabhu Dayacheyu - Nithya Deevenalu Beraakaalo Choothuru (2) 1. Keedu, Yuddhamu, Thegulu, Karuvainanu - Daadi Cheyabooni Vijrumbhinchi Napudu (2) Neevu Morapettina Neeku Doruku - Nijamugaa - Rakshana (2) 2. Shathru Shodhanalu Pai Badinappudu - Shakthiheenulamai Poyinappudu Kreesthu Dayacheyu Nithyaadarana - Nijamugaa - Choothuru 3. Prabhu Yuddhamu Cheyu Naayakudu - Prabhu Pakshamandu Cherumu Yeenaade Neevu Pondedavu Beraakaalo - Nijamugaa - Jayamu 4. Paluvidha Shramalandu Cherumaa - Preethimeera Mimmu Daricherchunu Neethiyukthamugaa Sthuthinchumu - Khyaathitho Prabhuni 5. Nithyadevuni MahaaKrupa Nirathan - Shathruvunu Jayinchunu Nishchayan Kruthagnatha Sthuthulu Meeru - Nithyamugaa Chellinchudi 6. Svaramandala Sithaaraa Vaayinchudi - Shathruvulatho Prabhu Porusalpenu Beraakaalo Prabhu Svarameththi - Mari Mari - Paadudi 7. Parama Thandri Prasaadinchu Nemmadi - Bhooraajulu Gadagada Vanikiri Thana Prajalanu Santhoshaparachunu - Hallelooya - Paadudi