ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదము - YouWorship
Prabhu Goppa Kaaryamulu Chesenani Manamuthsahinchedamu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదము (2) ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించె నహా (2) అను పల్లవి: ఆహా స్తోత్రము స్తోత్రములు - ఇంతవరకు కాచె (2) పాత్రులముగా సేవింతుము (2) 1. దైవ కార్యములు జనముల మధ్య - ప్రసిద్ధి చేయుదము (2) దేవుని ఆశ్చర్య కార్యము మనలో - ధ్యానించి పాడెదము (2) 2. సంగీత గానములతోను - సన్నుతించుచు ప్రభుని సితార స్వర మండలములతో - మన మార్భాటించెదము 3. మన భారములన్నియు తొలగించి - ఘనకార్యములను జేసె దినమెల్ల పాడుచు ఘనపరచెదము - చాటించెద మిలలో 4. నూతన కార్యములు చేయువాడు - ప్రభు వాశ్చర్యకరుడు బలమగు కార్యములు చేయువాడాయనే ధైర్యముగా పాడెదం 5. ప్రేమా సౌందర్యములు గలవాడు క్షేమము నిచ్చువాడు మహిమైశ్వర్యములు గలవాడాయనే మహిని బొగడెదము 6. మనకెన్నో వాగ్దానము లిచ్చె మన మనుభవించితిమి ఘనతా మహిమ ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమెన్ Pallavi: Prabhu Goppa Kaaryamulu Chesenani Manamuthsahinchedamu (2) Prabhu Goppa Melula Varshamu Manapai Kuripinche Nahaa (2) Anu Pallavi: Aahaa Sthothramu Sthothramulu - Inthavaraku Kaache (2) Paathrulamugaa Sevinthumu (2) 1. Daiva Kaaryamulu Janamula Madhya - Prasiddhi Cheyudamu (2) Devuni Aashcharya Kaaryamu Manalo - Dhyaaninchi Paadedamu (2) 2. Sanggeetha Gaanamulathonu - Sannuthinchuchu Prabhuni Sithaara Svara Mandalamulatho - Mana Maarbhaatinchedamu 3. Mana Bhaaramulanniyu Tholaginchi - Ghanakaaryamulanu Jese Dinamella Paaduchu Ghanaparachedamu - Chaatincheda Milalo 4. Noothana Kaaryamulu Cheyuvaadu - Prabhu Vaashcharyakarudu Balamagu Kaaryamulu Cheyuvaadaayane Dhairyamugaa Paadedan 5. Premaa Saundaryamulu Galavaadu Kshemamu Nichchuvaadu Mahimaishvaryamulu Galavaadaayane Mahini Bogadedamu 6. Manakenno Vaagdaanamu Lichche Mana Manubhavinchithimi Ghanathaa Mahima Prabhaavamu Prabhunake Hallelooyaa Aamen