ప్రభువైన క్రీస్తులో - YouWorship
Prabhuvaina Kreesthulo
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రభువైన క్రీస్తులో తండ్రి - ప్రేమతో నిచ్చె - పరలోక దీవెనలు - విరివిగను (1) ప్రభువైన క్రీస్తులో తండ్రి (1) అను పల్లవి: తెరువబడె - ఆకాశము మనకై (2) || ప్రభు || 1. నీతి యావత్తును నెరవేర్చ క్రీస్తు - బాప్తిస్మమొందిన క్షణమందే (2) తెరువబడిన ఆకాశము నుండి (2) - పరిశుద్ధ ఆత్మ దిగివచ్చె (1) 2. మనుష్య కుమారుడు మహిమను నొందగ - పరలోక వార్తలు వివరింప తెరువబడిన ఆకాశము నుండి - దూతలు ఎక్కుచు దిగుచుండె 3. దయ్యముల్ లోబడ సంతోషింపకు - నిజ సంతోషము ప్రభు తెలిపె తెరువబడిన పరలోకము నందు - వ్రాయబడెను మీ పేరులనే 4. పాటింపకు నర భేదము లేవి - ధీటైన సంఘమర్మమని తెరువబడిన ఆకాశము నుండి - పొందెను పేతురు దర్శనము 5. మేఘ ధనస్సున్న సింహాసనమున - తేజోమయుడై ప్రభువుండ తెరువబడిన పరలోకము నందు - యెహోవాను గాంచె పరవశుడై 6. లేదిక చీకటి దీప కాంతియు - ప్రబువే వారికి వెలుగాయె తెరుబడిన పరలోకమునందున - స్తుతి చెల్లింతురు పరిశుద్ధులు 7. నూతన సృష్టిలో నుండ నాశించిన - క్రీస్తులో తిరిగి జన్మించుము జయించు వానిగా నీవుండినచో - రాజ్యము చేతువు క్రీస్తునితో Pallavi: Prabhuvaina Kreesthulo Thandri - Prematho Nichche - Paraloka Deevenalu - Viriviganu (1) Prabhuvaina Kreesthulo Thandri (1) Anu Pallavi: Theruvabade - Aakaashamu Manakai (2) || Prabhu || 1. Neethi Yaavaththunu Neravercha Kreesthu - Baapthismamondina Kshanamande (2) Theruvabadina Aakaashamu Nundi (2) - Parishuddha Aathma Digivachche (1) 2. Manushya Kumaarudu Mahimanu Nondaga - Paraloka Vaarthalu Vivarimpa Theruvabadina Aakaashamu Nundi - Doothalu Ekkuchu Diguchunde 3. Dayyamul Lobada Santhoshimpaku - Nija Santhoshamu Prabhu Thelipe Theruvabadina Paralokamu Nandu - Vraayabadenu Mee Perulane 4. Paatimpaku Nara Bhedamu Levi - Dheetaina Sangghamarmamani Theruvabadina Aakaashamu Nundi - Pondenu Pethuru Darshanamu 5. Megha Dhanassunna Sinhaasanamuna - Thejomayudai Prabhuvunda Theruvabadina Paralokamu Nandu - Yehovaanu Gaanche Paravashudai 6. Ledika Cheekati Deepa Kaanthiyu - Prabuve Vaariki Velugaaye Therubadina Paralokamunanduna - Sthuthi Chellinthuru Parishuddhalu 7. Noothana Srushtilo Nunda Naashinchina - Kreesthulo Thirigi Janminchumu Jayinchu Vaanigaa Neevundinacho - Raajyamu Chethuvu Kreesthunitho