ప్రభువైన క్రీస్తుకు దాసులారా - YouWorship
Prabhuvaina Kreesthuku Daasulaaraa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రభువైన క్రీస్తుకు - దాసులారా పరిపూర్ణమనస్సుతో - ప్రభును సేవించుడి (2) అను పల్లవి: తన సన్నిధిలో నిలచుటకును శ్రద్ధగాను కొలచుటకును మిమ్మును ప్రభు ఎన్నుకొనెను (2) 1. పాపము వలన గత కాలమున - సాతానునకు దాసులమై యుంటిమి (2) పాపక్షమాపణ క్రీస్తులో పొంది - సాతాను చెరనుండి విడుదల నొంది ధన్యులమైతిమి - క్రీస్తుకు - దాసులమైతిమి 2. మీ తలాంతులని వాదుడి ప్రభుకై - రెండంతలుగ వృద్ధి చేయుడి నమ్మకమైన నిజ దాసులుగా - తన పరిచర్య చేయుడి నిరతము ఘనతను పొందెదరు - మీరు - తన సన్నిధియందున 3. యెహోవానే మీరు సేవించుచుందుడి - వేరెవ్వరిని ఇక సేవించకుడి పొలములో పంటలు పండకయున్నను - సాలలో పశువులు లేకపోయినను సర్వదా సేవించుచు - మీరు - ప్రభువులో హర్షించుడి 4. సర్వము ప్రభుకై అర్పించుకొని - ఆసక్తిగా తన సేవ చేయుడి ఘనమైన ఈ గొప్ప భాగ్యము - గమనము చేయుడి మీ బాధ్యత ఇదే వ్యర్థము కానేరదు - ప్రభునందు మీ ప్రతి ప్రయాసము 5. ప్రభువు త్వరగా రానైయున్నాడు నిద్రించువారు విడువబడెదరు మెళకువగా నుండు దాసులైయుండి - తన చిత్తమును జరిగించుచుండుడి జీతము తానిచ్చును - మీకు మీ క్రియల ప్రతిఫలముగా Pallavi: Prabhuvaina Kreesthuku - Daasulaaraa Paripoornamanassutho - Prabhunu Sevinchudi (2) Anu Pallavi: Thana Sannidhilo Nilachutakunu Shraddhagaanu Kolachutakunu Mimmunu Prabhu Ennukonenu (2) 1. Paapamu Valana Gatha Kaalamuna - Saathaanunaku Daasulamai Yuntimi (2) Paapakshamaapana Kreesthulo Pondi - Saathaanu Cheranundi Vidudala Nondi Dhanyulamaithimi - Kreesthuku - Daasulamaithimi 2. Mee Thalaanthulani Vaadudi Prabhukai - Rendanthaluga Vruddhi Cheyudi Nammakamaina Nija Daasulugaa - Thana Paricharya Cheyudi Nirathamu Ghanathanu Pondedaru - Meeru - Thana Sannidhiyanduna 3. Yehovaane Meeru Sevinchuchundudi - Verevvarini Ika Sevinchakudi Polamulo Pantalu Pandakayunnanu - Saalalo Pashuvulu Lekapoyinanu Sarvadaa Sevinchuchu - Meeru - Prabhuvulo Harshinchudi 4. Sarvamu Prabhukai Arpinchukoni - Aasakthigaa Thana Seva Cheyudi Ghanamaina Ee Goppa Bhaagyamu - Gamanamu Cheyudi Mee Baadhyatha Ide Vyarthamu Kaaneradu - Prabhunandu Mee Prathi Prayaasamu 5. Prabhuvu Thvaragaa Raanaiyunnaadu Nidrinchuvaaru Viduvabadedaru Melakuvagaa Nundu Daasulaiyundi - Thana Chiththamunu Jariginchuchundudi Jeethamu Thaanichchunu - Meeku Mee Kriyala Prathiphalamugaa