ప్రభువు దిగివచ్చును పరమునుండి వేగమే - YouWorship
Prabhuvu Digivachchunu Paramunundi Vegame
Artist: సీయోను గీతాలు
Category: Second Coming
Song Lyrics
పల్లవి: ప్రభువు దిగివచ్చును పరమునుండి వేగమే (1) విభుడు తిరిగివచ్చును పరమ వధువుకై (2) 1. ప్రభువు దిగివచ్చు నార్భటముతో (2)- దూత శబ్దముతో బూరధ్వనితో (2) క్రీస్తునందు మృతులు మొదటనే లేతురు (2) వారితో నేకమై ప్రభువు నెదుర్కొందువా? (2) 2. వాని వాని పనులనుబట్టి ప్రభువు - సిద్ధపరచిన జీతము తానిచ్చును తానే త్వరగా వచ్చున్ ఎదుర్కొన సిద్ధమా సిగ్గుతో భయముతో నుందువా దినమునా? 3. హృదయములో కలవరపడక - క్రీస్తునందు విశ్వాసముంచుడి శుద్ధులుగ మీరు సిద్ధమనస్సుతోడ ప్రార్ధన చేయుచు మేల్కొని యుండుడి 4. అనేకుల పాపములను భరింప - ఒక్కసారే క్రీస్తు అర్పించుకొనెను తనకొరకై వేచియుండు వారికొరకు పాపరహితుడు తిరిగి ప్రత్యక్షమౌ 5. ప్రొద్దు గ్రుంకి వచ్చునో ఎప్పుడో అర్థరాత్రియో తెల్లవారు ఝామునో నిద్దుర పోవుచునుండగా వచ్చునో మేల్కొనియుండుడి మీరు ఎల్లప్పుడు Pallavi: Prabhuvu Digivachchunu Paramunundi Vegame (1) Vibhudu Thirigivachchunu Parama Vadhuvukai (2) 1. Prabhuvu Digivachchu Naarbhatamutho (2)- Dootha Shabdamutho Booradhvanitho (2) Kreesthunandu Mruthulu Modatane Lethuru (2) Vaaritho Nekamai Prabhuvu Nedurkonduvaa? (2) 2. Vaani Vaani Panulanubatti Prabhuvu - Siddhaparachina Jeethamu Thaanichchunu Thaane Thvaragaa Vachchun Edurkona Siddhamaa Siggutho Bhayamutho Nunduvaa Dinamunaa? 3. Hrudayamulo Kalavarapadaka - Kreesthunandu Vishvaasamunchudi Shuddhuluga Meeru Siddhamanassuthoda Praardhana Cheyuchu Melkoni Yundudi 4. Anekula Paapamulanu Bharimpa - Okkasaare Kreesthu Arpinchukonenu Thanakorakai Vechiyundu Vaarikoraku Paaparahithudu Thirigi Prathyakshamau 5. Proddu Grungki Vachchuno Eppudo Artharaathriyo Thellavaaru Jhaamuno Niddura Povuchunundagaa Vachchuno Melkoniyundudi Meeru Ellappudu