ప్రభువుకు తగినట్లు నడుచుకొందము రండి - YouWorship
Prabhuvuku Thaginatlu Naduchukondamu Randi
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: ప్రభువుకు తగినట్టు - నడుచుకొందము రండి తన్ రాజ్య మహిమకును - తగినట్టు నడుచుకొందము రండి 1. ఆదాము దేవుని, నిబంధనను మీరి - దారి తప్పిపోయెను (2) హానోకు దేవునితో కూడ నడువగా (2) తనతో నతనిని కొనిపోయెను 2. నోవహు దేవునితో కూడ నడిచె - కృప పొందినవాడై తనతరములో నీతిమంతునిగా నెంచి జలప్రళయమునుండి కాపాడెను 3. అబ్రాము దేవుని సన్నిధిలో నడిచె - నిందారహితునిగా దేవుడతనితో, నిబంధనను చేసి తన స్నేహితుడని ప్రకటించెను 4. దేవుని యింటి దర్శనము పొంది - ప్రజలను నడిపించెను మోషే దేవుని యింటిలో నమ్మకమైన వాడని ప్రభువే పలికెనుగా 5. దేవుని కట్టడల ననుసరించి - నడుచుకొనెను దావీదు స్థిరపరచెనాతని సింహాసనమును తన చిత్తానుసారుడని పలికెన్ 6. పేతురు , యాకోబు , యోహానులు - ప్రభువును వెంబడించిరి పరలోక సంఘ దర్శనమిచ్చి మనుజులను పట్టువారిగా చేసెన్ 7. పునరుర్ధానుడైన ప్రభువును గనక - ఎమ్మాయి కెళ్లిరి శిష్యులు యేసే వారితో కూడా నడిచెను గద్దించి వారి కళ్ళు తెరిపించెను 8. వస్త్రములు అపవిత్రపరచుకొనని - కొందరుండిరి సార్దీసులో అర్హులై తెల్లని వస్త్రము ధరించి సంచరింతురు ప్రభుతో 9. యేసుని వెలుగులో నడుచుకొందము రండి - జీవముగల దేవుని సంఘమా మన అతిక్రమములను ఒప్పుకొనెదము యేసుతో కలిసి కొనసాగేదం Pallavi: Prabhuvuku Thaginattu - Naduchukondamu Randi Than Raajya Mahimakunu - Thaginattu Naduchukondamu Randi 1. Aadaamu Devuni, Nibandhananu Meeri - Daari Thappipoyenu (2) Haanoku Devunitho Kooda Naduvagaa (2) Thanatho Nathanini Konipoyenu 2. Novahu Devunitho Kooda Nadiche - Krupa Pondinavaadai Thanatharamulo Neethimanthunigaa Nenchi Jalapralayamunundi Kaapaadenu 3. Abraamu Devuni Sannidhilo Nadiche - Nindaarahithunigaa Devudathanitho, Nibandhananu Chesi Thana Snehithudani Prakatinchenu 4. Devuni Yinti Darshanamu Pondi - Prajalanu Nadipinchenu Moshe Devuni Yintilo Nammakamaina Vaadani Prabhuve Palikenugaa 5. Devuni Kattadala Nanusarinchi - Naduchukonenu Daaveedu Sthiraparachenaathani Sinhaasanamunu Thana Chiththaanusaarudani Paliken 6. Pethuru , Yaakobu , Yohaanulu - Prabhuvunu Vembadinchiri Paraloka Sanggha Darshanamichchi Manujulanu Pattuvaarigaa Chesen 7. Punarurdhaanudaina Prabhuvunu Ganaka - Emmaayi Kelliri Shishyulu Yese Vaaritho Koodaa Nadichenu Gaddinchi Vaari Kallu Theripinchenu 8. Vasthramulu Apavithraparachukonani - Kondarundiri Saardeesulo Arhulai Thellani Vasthramu Dharinchi Sancharinthuru Prabhutho 9. Yesuni Velugulo Naduchukondamu Randi - Jeevamugala Devuni Sangghamaa Mana Athikramamulanu Oppukonedamu Yesutho Kalisi Konasaagedang