ప్రభువుకు తగినట్లు - YouWorship
Prabhuvuku Thaginatlu
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: ప్రభువుకు తగినట్టు - పృథివిలో ప్రియుడా - పదిలముగా జీవించవా? (2) 1. ఆదామవ్వలవలె నీవు సహ - కేవలము దిగంబరివైయుండ (2) ఆ దేవగొర్రెపిల్ల చావొంది సిలువలో పావన వస్త్రముల నిచ్చెను (2) 2. శ్రేష్ఠబలి నిచ్చి హేబెలు - సృష్టికర్త యొక్క సాక్ష్యము పొందె అట్టి సాక్ష్యము పొందను అవనిలో ప్రియుడా - హతసాక్షిగా నీ వుండెదవా? 3. ప్రభు యడుగుజాడలను పరికించి ప్రభు - కనుకూలంబుగా నడచినచో హానోకువలె ఆ రెండవ మరణము - నొందక ప్రభుతో నుండెదవు 4. పరిశుద్ధమైన ప్రవర్తనలో- ప్రభు సర్వాంగ కవచముల్ కల్గి నీతిన్ ప్రకటించిన నోవహున్ బోలి - ఖ్యాతి సువార్తన్ చాటు మిలన్ 5. మృతులను సహలేపు మహాత్మ్యుడని - తన సుతునర్పించె నబ్రాహాము మృతికి లోనగు నీ శరీరంబును - అతనికె బలిగా నర్పించు 6. తన తండ్రి ఖడ్గమునకు ఇస్సాకు - మౌనమున్ జూపి మరణము గోరె కడు శ్రమకాలములో ఖండించె ఖడ్గము - ముంగిట నీవట్లుండెదవా? 7. యెహోవా భయము నొంది యోసేపు - ఎంత వైభవ మనుభవించెనో గాంచు నీ జీవితంబులో దైవ భయము నొంది - అక్షయ కిరీటమున్ బొందు Pallavi: Prabhuvuku Thaginattu - Pruthivilo Priyudaa - Padilamugaa Jeevinchavaa? (2) 1. Aadaamavvalavale Neevu Saha - Kevalamu Digambarivaiyunda (2) Aa Devagorrepilla Chaavondi Siluvalo Paavana Vasthramula Nichchenu (2) 2. Shreshthabali Nichchi Hebelu - Srushtikartha Yokka Saakshyamu Ponde Atti Saakshyamu Pondanu Avanilo Priyudaa - Hathasaakshigaa Nee Vundedavaa? 3. Prabhu Yadugujaadalanu Parikinchi Prabhu - Kanukoolambugaa Nadachinacho Haanokuvale Aa Rendava Maranamu - Nondaka Prabhutho Nundedavu 4. Parishuddhamaina Pravarthanalo- Prabhu Sarvaangga Kavachamul Kalgi Neethin Prakatinchina Novahun Boli - Khyaathi Suvaarthan Chaatu Milan 5. Mruthulanu Sahalepu Mahaathmyudani - Thana Suthunarpinche Nabraahaamu Mruthiki Lonagu Nee Shareerambunu - Athanike Baligaa Narpinchu 6. Thana Thandri Khadgamunaku Issaaku - Maunamun Joopi Maranamu Gore Kadu Shramakaalamulo Khandinche Khadgamu - Munggita Neevatlundedavaa? 7. Yehovaa Bhayamu Nondi Yosepu - Entha Vaibhava Manubhavincheno Gaanchu Nee Jeevithambulo Daiva Bhayamu Nondi - Akshaya Kireetamun Bondu