ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము - YouWorship
Prabhuvaa Nee Goppathanamu Sthuthiki Yogyamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
"యెహోవా మహాత్మ్యము గలవాడు. ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు." కీర్తన Psalm 145:3 పల్లవి : ప్రభువా నీ గొప్పతనము - స్తుతికి యోగ్యము అశక్యమైనది - వర్ణించలేమిల 1. సృష్టి గొప్పది అద్భుతమేగా - సంకల్పమెంతో వుత్తమము మానవజాతి కొరకై ప్రభూ - సిద్దపరచె సమస్తము నీదు పనులు నీ సామర్ధ్యము వర్ణించలేమిల || ప్రభువా || 2. నీ రూపమున నరుని సృజించి - అధికారము నిచ్చితివి క్రీస్తునందు నిర్దోషినిగా - నిలువబెట్ట గోరితివి నీదు దయ నీ మంచితనము వర్ణించలేమిల || ప్రభువా || 3. సృష్టిని చేసిన శక్తికంటె - పాపికి రక్షణ గొప్పది నీ యొద్ద నున్న సర్వమిచ్చి - విలువగు ముత్యము కొన్నావు నీ ఐశ్వర్యము నీ మహిమను వర్ణించలేమిల || ప్రభువా || 4. నీకు మానవుడమూల్యము - నీవు ప్రేమించుచున్నావు అందుకే నీ ప్రాణమర్పించి - రక్తము కార్చి రక్షించితివి నీ అద్భుత ప్రేమ నీ కృప వర్ణించలేమిల || ప్రభువా || 5. అద్భుతమైన నూతన సృష్టి - మానవునికి నిచ్చితివి రాజులనుగ యాజకులుగ వారసులుగను చేసితివి నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించలేమిల || ప్రభువా || 6. ఉల్లాసముతో సృష్టి మైమరచే - అద్భుత కార్యములను చూచి సంతోషించి ఆరాధించిరి - నీవే సర్వమని చెప్పిరి నీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించలేమిల || ప్రభువా || "Yehovaa Mahaathmyamu Galavaadu. Aayana Adhika Sthothramu Nondadaginavaadu." Keerthana Psalm 145:3 Pallavi : Prabhuvaa Nee Goppathanamu - Sthuthiki Yogyamu Ashakyamainadi - Varninchalemila 1. Srushti Goppadi Adbhuthamegaa - Sangkalpamentho Vuththamamu Maanavajaathi Korakai Prabhoo - Siddaparache Samasthamu Needu Panulu Nee Saamardhyamu Varninchalemila || Prabhuvaa || 2. Nee Roopamuna Naruni Srujinchi - Adhikaaramu Nichchithivi Kreesthunandu Nirdoshinigaa - Niluvabetta Gorithivi Needu Daya Nee Manchithanamu Varninchalemila || Prabhuvaa || 3. Srushtini Chesina Shakthikante - Paapiki Rakshana Goppadi Nee Yodda Nunna Sarvamichchi - Viluvagu Muthyamu Konnaavu Nee Aishvaryamu Nee Mahimanu Varninchalemila || Prabhuvaa || 4. Neeku Maanavudamoolyamu - Neevu Preminchuchunnaavu Anduke Nee Praanamarpinchi - Rakthamu Kaarchi Rakshinchithivi Nee Adbhutha Prema Nee Krupa Varninchalemila || Prabhuvaa || 5. Adbhuthamaina Noothana Srushti - Maanavuniki Nichchithivi Raajulanuga Yaajakuluga Vaarasuluganu Chesithivi Nee Raajyamu Nee Prabhaavamu Varninchalemila || Prabhuvaa || 6. Ullaasamutho Srushti Maimarache - Adbhutha Kaaryamulanu Choochi Santhoshinchi Aaraadhinchiri - Neeve Sarvamani Cheppiri Nee Prabhuthvamu Needu Sathyamu Varninchalemila || Prabhuvaa ||