ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో - YouWorship
Prabhuvaa Nee Kaaryamunu Noothana Parachumu Maalo
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రభువా నీ కార్యమును (1) - నూతన పరచుము మాలో (2) పరిశుద్ధ దేవా నీకు (1) - ప్రజలమై యున్నా మిలలో (2) 1. సంవత్సరములు జరుగు - చుండగనే సత్యదేవా (2) విలువైన నీదు కార్యమును (2) - తెలియజేయుము మాకు (2) 2. పాపము జేసి నీదు - కోపము రేపితిమయ్యా కోపించుచునే నీదు - వాత్సల్యము జూపుమయ్యా 3. ప్రేమతో మము రక్షించి - క్షేమము నిచ్చితివయ్యా ప్రేమించకున్నాము మేము - ప్రేమా మయుడా నిన్ను 4. వెలిగించితివి మమ్మిలలో - వెలుగైన ఓ మా ప్రభువా పలుచోట్ల లోన మేము - వెలుగకున్నామయ్యా 5. మారుచున్న లోకమున - కారుతొట్లలో త్రాగన్ జీవపు ఊటవు నిన్ను విడచి - త్రొవతప్పితిమయ్యా 6. సోదర ప్రేమను జూపు - మాదిరి విడచితిమయ్యా ఓదార్పు పొందిన మేము - ఆదరణియ్యకున్నాము 7. మేలిమి బంగారుగను - మమ్ముల జేసితివయ్యా మాలిన్యమునంటి మేము - మందగిలియున్నాము 8. మాటతప్పని మాదేవా - కోటగా నున్నావయ్యా చాటించెద నీదు ప్రేమన్ - సాటిలేని ప్రియుడా Pallavi: Prabhuvaa Nee Kaaryamunu (1) - Noothana Parachumu Maalo (2) Parishuddha Devaa Neeku (1) - Prajalamai Yunnaa Milalo (2) 1. Sanvathsaramulu Jarugu - Chundagane SathyaDevaa (2) Viluvaina Needu Kaaryamunu (2) - Theliyajeyumu Maaku (2) 2. Paapamu Jesi Needu - Kopamu Repithimayyaa Kopinchuchune Needu - Vaathsalyamu Joopumayyaa 3. Prematho Mamu Rakshinchi - Kshemamu Nichchithivayyaa Preminchakunnaamu Memu - Premaa Mayudaa Ninnu 4. Veliginchithivi Mammilalo - Velugaina O Maa Prabhuvaa Paluchotla Lona Memu - Velugakunnaamayyaa 5. Maaruchunna Lokamuna - Kaaruthotlalo Thraagan Jeevapu Ootavu Ninnu Vidachi - Throvathappithimayyaa 6. Sodara Premanu Joopu - Maadiri Vidachithimayyaa Odaarpu Pondina Memu - Aadaraniyyakunnaamu 7. Melimi Banggaaruganu - Mammula Jesithivayyaa Maalinyamunanti Memu - Mandagiliyunnaamu 8. Maatathappani MaaDevaa - Kotagaa Nunnaavayyaa Chaatincheda Needu Preman - Saatileni Priyudaa