ప్రభువా నీవే నమ్మకమైన సామర్ధ్యుడవు - YouWorship
Prabhuvaa Neeve Nammakamaina Saamardhyudavu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రభువా నీవే నమ్మకమైన సామర్ధ్యుడవు (2) ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడ (2) 1. ఇహపరమందు - నివసించువారు - నీ నామమున మోకరింతురు (2) మహిమ పరతురు దేవుని (2) అంగీకరించు - ప్రతివాని జిహ్వ - నీవే క్రీస్తువనుచు (2) 2. అపారమైన - క్రియలు చేయుచు - మమ్మెల్ల పరిపాలించుచున్నావు ప్రేమ గల ప్రభువా పాపిని రక్షింప - యిహమున కరిగి - గొప్ప రక్షణనిచ్చె 3. ఐగుప్తు నుండి - విడిపించిన వారిని - నలువది వత్సరములు నడిపించితివి కాచితివి కనుపాపగ ఉంచియున్నావు - మాదిరిగా వారిన్ - నీ ఆలోచన గొప్పది 4. పరమును తెరచి - మన్నా కురిపించి - అందరికి జీవజలమిచ్చితివి పొందిరి తృప్తి నీయందు అగ్ని స్తంభము - మేఘ స్తంభమును - నిత్యము నడిపించును 5. తుఫానురేగి - నిరాశపరచ - శత్రువు మా మధ్య చెలరేగగ మమ్ములను రక్షించితివి వాగ్దానములు - నెరవేర్చి నీవే - స్వాస్థ్యము నిచ్చితివి Pallavi: Prabhuvaa Neeve Nammakamaina Saamardhyudavu (2) Entho Goppa Adbhuthamaina Prashaanthudaa Dayaaluda (2) 1. Ihaparamandu - Nivasinchuvaaru - Nee Naamamuna Mokarinthuru (2) Mahima Parathuru Devuni (2) Anggeekarinchu - Prathivaani Jihva - Neeve Kreesthuvanuchu (2) 2. Apaaramaina - Kriyalu Cheyuchu - Mammella Paripaalinchuchunnaavu Prema Gala Prabhuvaa Paapini Rakshimpa - Yihamuna Karigi - Goppa Rakshananichche 3. Aigupthu Nundi - Vidipinchina Vaarini - Naluvadi Vathsaramulu Nadipinchithivi Kaachithivi Kanupaapaga Unchiyunnaavu - Maadirigaa Vaarin - Nee Aalochana Goppadi 4. Paramunu Therachi - Mannaa Kuripinchi - Andariki Jeevajalamichchithivi Pondiri Thrupthi Neeyandu Agni Sthambhamu - Megha Sthambhamunu - Nithyamu Nadipinchunu 5. Thuphaanuregi - Niraashaparacha - Shathruvu Maa Madhya Chelaregaga Mammulanu Rakshinchithivi Vaagdaanamulu - Neraverchi Neeve - Svaasthyamu Nichchithivi