ప్రభువా నిన్నారాధింపను జేరితిమి - YouWorship
Prabhuvaa Ninnaaraadhimpanu Jerithimi
Artist: మొలతాటి విద్యానందము
Category: Praise & Worship
Song Lyrics
ప్రభువా నిన్నారాధింపను జేరితిమి యుదయ శుభకాంతి ప్రభవింపంగా దేవా నేడు శుభకాంతి విరజిమ్మంగా విభవముగను ప్రభాకరముగను విరియు నీ తేజంబెలర్చంగ నభి దనంబులంగూడి భక్తిని యాత్మతో సత్యంబుతోడను ||ప్రభువా|| 1. ఇరులుం గమ్మిననుండి - యరుణోదయము దనుక - నరిగాపు నీవే కాదా దేవా రాత్రి - యరిగాపు నీవేకాదా విరివిగా మా హృదయసీమల నెరసి యుండిన చీకటులుంబో దరిమి శాంతంబైన మనసుల దయంబ్రసాదింపను భజింతుము ||ప్రభువా|| 2. అనఘా నీ సాన్నిధ్య మున నుండంగా మా దుర్గుణముల నరి కట్టుమో దేవా మా దుర్గుణముల తుచి జేయుము వినయ భయ భక్తులుంద తీర్చిగ వినుచు నీ వాక్యోపదేశము లనిశమును ధ్యానింపనాత్మను బనిచి తుదకు ప్రసన్నమగుము ||ప్రభువా|| 3. పనిపాటలలో మేమో - దినము నీకే మహిమ నొనర్ప నడిపించుమో దేవా నిన్నే ఘన పరచ నడిపించుము తనువు శ్రమచేబడలినను మా దారి దుర్గమమైన కనంబడ వనటంజెందక నేది జేసిన ప్రభువు కొలకని చేయ నడుపుము ||ప్రభువా|| Prabhuvaa Ninnaaraadhimpanu Jerithimi Yudaya Shubhakaamthi Prabhavimpamgaa Devaa Nedu Shubhakaamthi Virajimmamgaa Vibhavamuganu Prabhaakaramuganu Viriyu Nee Thejambelarchamga Nabhi Danambulamgoodi Bhakthini Yaathmatho Sathyambuthodanu ||Prabhuvaa|| 1. Irulum Gamminanumdi - Yarunodayamu Danuka - Narigaapu Neeve Kaadaa Devaa Raathri - Yarigaapu Neevekaadaa Virivigaa Maa Hrudayaseemala Nerasi Yumdina Cheekatulumbo Darimi Shaamthambaina Manasula Dayambrasaadimpanu Bhajimthumu ||Prabhuvaa|| 2. Anaghaa Nee Saannidhya Muna Numdamgaa Maa Durgunamula Nari Kattumo Devaa Maa Durgunamula Thuchi Jeyumu Vinaya Bhaya Bhakthulumda Theerchiga Vinuchu Nee Vaakyopadeshamu Lanishamunu Dhyaanimpanaathmanu Banichi Thudaku Prasannamagumu ||Prabhuvaa|| 3. Panipaatalalo Memo - Dinamu Neeke Mahima Nonarpa Nadipimchumo Devaa Ninne Ghana Paracha Nadipimchumu Thanuvu Shramachebadalinanu Maa Daari Durgamamaina Kanambada Vanatamjemdaka Nedi Jesina Prabhuvu Kolakani Cheya Nadupumu ||Prabhuvaa||