ప్రభురాజ్యం నిశ్చలమైనది - YouWorship
Prabhuraajyan Nishchalamainadi
Artist: సీయోను గీతాలు
Category: Hope
Song Lyrics
పల్లవి: ప్రభురాజ్యం నిశ్చలమైనది - శుభప్రదంబు శాశ్వతమైనది (2) 1. పృథివినందు ఉన్న వన్నియు (2)- కదలి గతించి పోవుచున్నవి (2) గతించదు నీ వాక్యమెప్పుడు - ఖ్యాతిగాను నిలుచునెప్పుడు (2) 2. జనాంగములు కదలుచున్నవి - జగమందెల్లను శాంతియేలేదు ప్రభుని ప్రజలు స్థిరులై యుందురు - విభుని ప్రజలు నిత్యముండెదరు 3. భూమి ఆకాశముల్ కదలింపబడును - అంతరించి తరలిపోవున్ ప్రభుని గృహము కదలదెన్నడు - విభుని యిల్లు నిత్యమునిలుచున్ 4. ఉదయించునుగ రాజ్య మొకటి - పొడిచేయునుగ అన్యరాజ్యములన్ ఆ రాజ్యం అంతరించదు - ఆ రాజ్యం నిత్యము నిలుచున్ 5. తన ప్రజలకు రాజ్యము నొసగన్ - ఘనుడగు తండ్రి కోరిక యిదియే ప్రభు ప్రేమ చలించనేరదు - ప్రభు ప్రేమ నిలుచు నిరతం Pallavi: Prabhuraajyan Nishchalamainadi - Shubhapradambu Shaashvathamainadi (2) 1. Pruthivinandu Unna Vanniyu (2)- Kadali Gathinchi Povuchunnavi (2) Gathinchadu Nee Vaakyameppudu - Khyaathigaanu Niluchuneppudu (2) 2. Janaanggamulu Kadaluchunnavi - Jagamandellanu Shaanthiyeledu Prabhuni Prajalu Sthirulai Yunduru - Vibhuni Prajalu Nithyamundedaru 3. Bhoomi Aakaashamul Kadalimpabadunu - Antharinchi Tharalipovun Prabhuni Gruhamu Kadaladennadu - Vibhuni Yillu Nithyamuniluchun 4. Udayinchunuga Raajya Mokati - Podicheyunuga Anyaraajyamulan Aa Raajyan Antharinchadu - Aa Raajyan Nithyamu Niluchun 5. Thana Prajalaku Raajyamu Nosagan - Ghanudagu Thandri Korika Yidiye Prabhu Prema Chalinchaneradu - Prabhu Prema Niluchu Nirathang