ప్రభుయేసు సంఘము నిర్మించుచుండ - YouWorship
PrabhuYesu Sangghamu Nirminchuchunda
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: ప్రభుయేసు సంఘము నిర్మించుచుండ (2) గర్విసాతాను జయమొంద లేడు (2) 1. పరలోకమాదిరి నిర్మించుచుండె (2) - నరుని ఆలోచన జరిగింప డిందు (2) స్థిరపునాదిపై నిర్మించుచుండె (2) - పరిపూర్ణతను విరివిగా నింపున్ (1) 2. ఆదాముతో కూడ నడిచిన దేవుడు - గుడారమున వసియించినాడు సొలొమోనాలయము నింపినాడు - కాలమెల్ల తనయునిలో వసించున్ 3. క్రీస్తు ప్రభు దాని స్థిరపునాది - ఇసుక పై వేసిన నశియించునంత సజీవుడగు యేసు నిజ మూలరాయి - సజీవరాళ్ళను విజయుడు జేర్చున్ 4. నిత్య దేవుని నిజ ఆత్మజులారా - ఆత్మీయంబగు ఆలయము మీరే ఆత్మ ఐక్యమును అనుసరించుడి - హస్తకృతంబులు ఆలయమగునా? 5. యూదుడని మరి హెల్లేనీయుడని - లేదు జాతుల భేదము లేమి లేదు దాసుడు స్వతంత్రుడని - భేదముండదు స్త్రీ పురుషులని 6. ఏ నామమున లేనిది సంఘము - నామమిచ్చిన యెన్నదగు కీడు కనబడు కట్టడములు కలిపి పోల్తుమా - కనివిడిచెదము పొరబాటులను 7. ప్రకటించెదము ప్రాకటముగను - ఏక మనస్సుతో ఏక శరీరమని సకల కాలము శక్తితో నిలిచి - పొగడుచు శిరస్సును పాడెద మిపుడె Pallavi: PrabhuYesu Sangghamu Nirminchuchunda (2) Garvisaathaanu Jayamonda Ledu (2) 1. Paralokamaadiri Nirminchuchunde (2) - Naruni Aalochana Jarigimpa Dindu (2) Sthirapunaadipai Nirminchuchunde (2) - Paripoornathanu Virivigaa Nimpun (1) 2. Aadaamutho Kooda Nadichina Devudu - Gudaaramuna Vasiyinchinaadu Solomonaalayamu Nimpinaadu - Kaalamella Thanayunilo Vasinchun 3. Kreesthu Prabhu Daani Sthirapunaadi - Isuka Pai Vesina Nashiyinchunantha Sajeevudagu Yesu Nija Moolaraayi - Sajeevaraallanu Vijayudu Jerchun 4. Nithya Devuni Nija Aathmajulaaraa - Aathmayambagu Aalayamu Meere Aathma Aikyamunu Anusarinchudi - Hasthakruthambulu Aalayamagunaa? 5. Yoodudani Mari Helleneeyudani - Ledu Jaathula Bhedamu Lemi Ledu Daasudu Svathanthrudani - Bhedamundadu Sthree Purushulani 6. E Naamamuna Lenidi Sangghamu - Naamamichchina Yennadagu Keedu Kanabadu Kattadamulu Kalipi Polthumaa - Kanividichedamu Porabaatulanu 7. Prakatinchedamu Praakatamuganu - Eka Manassutho Eka Shareeramani Sakala Kaalamu Shakthitho Nilichi - Pogaduchu Shirassunu Paadeda Mipude