ప్రభుయేసు నాకై నీ సర్వము నిచ్చితివి - YouWorship
PrabhuYesu Naakai Nee Sarvamu Nichchithivi
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: ప్రభుయేసు నాకై నీ సర్వము నిచ్చితివి (2) ప్రేమనుబట్టి అర్పించు కొంటివి నాకై (2) 1. శిరస్సు నిచ్చితివి ముండ్ల మకుటముకై - స్వామి నా పాపముల కొరకే (2) సహింపజాలని వేదన బహుగా (1) - సహించితివి ప్రేమతోడ (2) 2. కన్నుల నిచ్చితివి కన్నీరు కార్చ - కరుణించి నా స్థితిని జూచి కరిగె నీ హృదయం దుఃఖంబుతోడ - కడు వేదనతో యేడ్చితివి 3. కొరడా దెబ్బలచే నీ దేహమంత - చారలుగ దున్నబడెను శరీరమంత రక్తమయమాయెను - వరదా! గాయము లొందితివా 4. కాళ్ళు చేతులలో మేకులు గొట్టిరి - బల్లెముతో ప్రక్కన్ బొడిచిరి యేలాగు వివరింతు నీ బాధ నేను - ఓర్చితివా మౌనము వహించి 5. ప్రాయశ్చిత్తంబై పోతివా నాకై - పాపము నుండి విడిపించుటకు పొందితి నెంతో గొప్ప రక్షణను - పశ్చాత్తాపము ద్వారా నేను 6. ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమ - ఎందు కింతగా ప్రేమించితివి వందన మర్పింతు నీ పాదములకే - పొందుగ నీ వాడనైతి 7. నా యెడల నీదు సంకల్పమేగా - నీ స్వాస్థ్య మనుభవించుటకు నీతోడ నిరతం నేనుండునట్లు - నీ యధికారం బిచ్చితివి Pallavi: PrabhuYesu Naakai Nee Sarvamu Nichchithivi (2) Premanubatti Arpinchu Kontivi Naakai (2) 1. Shirassu Nichchithivi Mundla Makutamukai - Svaami Naa Paapamula Korake (2) Sahimpajaalani Vedana Bahugaa (1) - Sahinchithivi Premathoda (2) 2. Kannula Nichchithivi Kanneeru Kaarcha - Karuninchi Naa Sthithini Joochi Karige Nee Hrudayan Duhkhambuthoda - Kadu Vedanatho Yedchithivi 3. Koradaa Debbalache Nee Dehamantha - Chaaraluga Dunnabadenu Shareeramantha Rakthamayamaayenu - Varadaa! Gaayamu Londithivaa 4. Kaallu Chethulalo Mekulu Gottiri - Ballemutho Prakkan Bodichiri Yelaagu Vivarinthu Nee Baadha Nenu - Orchithivaa Maunamu Vahinchi 5. Praayashchiththambai Pothivaa Naakai - Paapamu Nundi Vidipinchutaku Pondithi Nentho Goppa Rakshananu - Pashchaaththaapamu Dvaaraa Nenu 6. Entha Adbhuthamu Prabhuvaa Nee Prema - Endu Kinthagaa Preminchithivi Vandana Marpinthu Nee Paadamulake - Ponduga Nee Vaadanaithi 7. Naa Yedala Needu Sangkalpamegaa - Nee Svaasthya Manubhavinchutaku Neethoda Nirathan Nenundunatlu - Nee Yadhikaaran Bichchithivi