ప్రభుని రాకడ - YouWorship
Prabhuni Raakada
Artist: Unknown Artist
Category: Second Coming
Song Lyrics
ప్రభుని రాకడ – ఈ దినమే పరుగులిడి రండి – సుదినమే (2) పరమునందుండి – మన ప్రభువు ధరకు నరుగును – పాలనకై (2) బూరశబ్దముతో – జనులారా ||ప్రభుని|| సిద్ధులగు వారిన్ – మన యేసు శుద్ధి జేయునిలన్ – పరమునకై (2) బుద్ధిహీనులను – శ్రమలచేత బద్ధులుగ జేయున్ – వేదనతో (2) బాధ కలిగించున్ – సాతాను ||ప్రభుని|| స్వరముతో వచ్చున్ – అధికారి మహిమతో మరలున్ – తన దూత (2) సూర్యచంద్రునిలన్ – తారలతో జీకటుల్ క్రమ్మున్ – ప్రభు రాక (2) పగలు రాత్రియగున్ – త్వరపడుము ||ప్రభుని|| మొదట లేతురు – సజీవులై ప్రభునియందుండు – ఆ మృతులు (2) మరల అందరము – ఆ ధ్వనితో పరము జేరుదుము – ధరనుండి (2) ధన్యులగుదుము – పరికించు ||ప్రభుని|| వెయ్యియేండ్లు – పాలించెదరు ప్రియుని రాజ్యమున – ప్రియులు (2) సాయం సమయమున – చేరి నెమలి కోకిలలు – రాజున్ (2) పాడి స్తుతించును – ఆ దినము ||ప్రభుని|| గొర్రె మేకలును – ఆ చిరుత సింహజాతులును – ఒక చోట (2) భేధము లేక – బరుండి గరిక మేయును – ఆ వేళ (2) కలసి మెలగును – భయపడక ||ప్రభుని|| న్యాయ నీతులన్ – మన ప్రభువు ఖాయముగ దెల్పున్ – ఆనాడు (2) సాక్షులుగ నిలుతుం – అందరము స్వామియేసునకు – ధ్వజమెత్తి (2) చాటి యేసునకు – ఓ ప్రియుడా ||ప్రభుని|| Prabhuni Raakada – Ee Diname Parugulidi Randi – Sudiname (2) Paramunandundi Mana – Prabhuvu Dharaku Narugunu – Paalanakai (2) Boora Shabdamutho – Janulaaraa ||Prabhuni|| Siddhulagu Vaarin – Mana Yesu Shuddhi Jeyunilan – Paramunakai (2) Buddhiheenulanu – Shramala Chetha Baddhuluga Jeyun – Vedanatho (2) Baadha Kaliginchun – Saathaanu ||Prabhuni|| Swaramutho Vachchun – Adhikaari Mahimatho Maralun – Thana Dootha (2) Soorya Chandrunilan – Thaaralatho Jeekatul Kramman – Prabhu Raaka (2) Pagalu Raathriyagun – Thvarapadumu ||Prabhuni|| Modata Lethuru – Sajeevulai Prabhuni Yandundu – Aa Mruthulu (2) Marala Andaramu – Aa Dhwanitho Paramu Jerudumu – Dhara Nundi (2) Dhanyulagudumu – Parikinchu ||Prabhuni|| Veyyi Yendlu – Paalinchedaru Priyuni Raajyamuna – Priyulu (2) Saayam Samayamuna – Cheri Nemali Kokilalu – Raajun (2) Paadi Sthuthinchunu – Aa Dinamu ||Prabhuni|| Gorre Mekalunu – Aa Chirutha Simha Jaathulunu – Oka Chota (2) Bedhamu Leka – Barundi Garika Meyunu – Aa Vela (2) Kalasi Melagunu – Bhayapadaka ||Prabhuni|| Nyaaya Neethulan – Mana Prabhuvu Khaayamuga Delpun – Aa Naadu (2) Saakshuluga Niluthum – Andaramu Swaami Yesunaku – Dhwajametthi (2) Chaati Yesunaku – O Priyudaa ||Prabhuni||