ప్రభుని గృహము - YouWorship
Prabhuni Gruhamu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను (2) అపరాధములచే ప్రజలందరును దేవుని మహిమను కోల్పోయిరి (2) తన మహిమను మన కిచ్చుటకు (2) యేసు ప్రభువే బలి యాయెన్ (2) ||ప్రభుని|| కృపా సత్యములు సంపూర్ణముగా మన మధ్యలో వసించెను (2) తండ్రి మహిమను తన సుతునిలో (2) మనమందరము చూచితిమి (2) ||ప్రభుని|| ప్రభువు యింటిని నిర్మించు చుండె సజీవమైన రాళ్ళతో (2) ఆయన మహిమ దానియందుండ (2) తన సంకల్పమై యున్నది (2) ||ప్రభుని|| శాంతిరాజు యిల్లు కట్టుచున్నాడు మానవ హస్తము అందుండదు (2) క్రయమునిచ్చి స్థలముకొనెను (2) తాను కోరిన స్థలమదే (2) ||ప్రభుని|| ప్రత్యేకపరచిన ఆత్మీయ యింటికి తన పునాదిని వేసెను (2) రక్షణ జీవిత సాక్ష్యము ద్వారా (2) ప్రభువే సర్వము చేసెను (2) ||ప్రభుని|| సింహాసనముపై కూర్చున్న ప్రభువే అణగ ద్రొక్కెను శత్రువును (2) సంపూర్ణ జయముతో ఆర్భాటముతో (2) వెలిగించెను తన యింటిని (2) ||ప్రభుని|| దేవుని యిల్లు ముగించబడగా పైనుండి అగ్ని దిగివచ్చున్ (2) దహించబడును సర్వ మలినము (2) ఇంటిని మహిమతో నింపును (2) ||ప్రభుని|| Prabhuni Gruhamu Aayana Mahimatho Paripoornamugaa Nindenu (2) Aparaadhamulache Prajalandarunu Devuni Mahimanu Kolpoyiri (2) Thana Mahimanu Manakichchutaku (2) Yesu Prabhuve Bali Yaayen (2) ||Prabhuni|| Krupaa Sathyamulu Sampoornamugaa Mana Madhyalo Vasinchenu (2) Thandri Mahimanu Thana Suthunilo (2) Manamandaramu Choochithimi (2) ||Prabhuni|| Prabhuvu Intini Nirminchuchunde Sajeevamaina Raallatho (2) Aayana Mahima Daaniyandunda (2) Thana Sankalpamaiyunnadi (2) ||Prabhuni|| Shaanthi Raaju Illu Kattuchunnaadu Maanava Hasthamu Andundadu (2) Krayamunichchi Sthalamu Konenu (2) Thaanu Korina Sthalamide (2) ||Prabhuni|| Prathyekaparachina Aathmeeya Intiki Thana Punaadini Vesenu (2) Rakshana Jeevitha Aakshyamu Dwaaraa (2) Prabhuve Sarvamu Chesenu (2) ||Prabhuni|| Simhaasanamupai Koorchunna Prabhuve Anaga Drokken Shathruvunu (2) Sampoorna Jayamutho Aarbhaatamutho (2) Veliginchenu Thana Intini (2) ||Prabhuni|| Devuni Illu Muginchabadagaa Painundi Agni Digivachchun (2) Dahinchabadunu Sarva Malinamu (2) Intini Mahimatho Nimpunu (2) ||Prabhuni||