పొందుచున్నాము అత్యధిక విజయము - YouWorship
Ponduchunnaamu Athyadhika Vijayamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: పొందుచున్నాము - అత్యధిక విజయము మనలను ప్రేమించిన - యేసుని ద్వారా 1. మనలను ప్రేమించి ప్రాణమిచ్చెను - మృతిని గెల్చి తిరిగిలేచెను -(2) శత్రువునోడించి విజయమిచ్చెను (2) పాపము క్షమించి రక్షించుటచే 2. వాక్యము ద్వారా బలపరచెను - విశ్వాసములో స్థిరపరచెను శరీరము పాపముపై జయముపొంది తన స్వరూపమునకు మార్చబడుటచే 3. పరిశుద్ధులగుటకు మనల పిలిచి - తన ఆత్మ ద్వారా నడిపించెను దేవుని పిల్లలమని సాక్షమిచ్చెను క్రీస్తులో మహిమ పరచబడుటకు 4. దేవుని ఇంటిగ కట్టబడుచున్నాము - సహవాసములో నిలిచి యుండి సోదర ప్రేమలో వినయ మనస్కులై ఆశీర్వాదమునకు వారసులమవుటకు 5. మన పతనములు పాపములబట్టి - యింటి గోడలు బీటలు వారెను మన అతిక్రమమును ఒప్పుకొందుము లోకము నుండి వేరైన వారమై 6. మన ప్రభు యేసు వచ్చుచుండగా - త్వరగా రమ్మని ఎదురు చూతము శత్రువును ధైర్యముతో ఎదుర్కొనెదము వినయ విధేయత కలిగియుండి 7. సిద్ధపడుడి దైవ జనమా - బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్దెలలోన నూనెను గలిగి మెలకువ కలిగి సిద్ధపాటుతో Pallavi: Ponduchunnaamu - Athyadhika Vijayamu Manalanu Preminchina - Yesuni Dvaaraa 1. Manalanu Preminchi Praanamichchenu - Mruthini Gelchi Thirigilechenu -(2) Shathruvunodinchi Vijayamichchenu (2) Paapamu Kshaminchi Rakshinchutache 2. Vaakyamu Dvaaraa Balaparachenu - Vishvaasamulo Sthiraparachenu Shareeramu Paapamupai Jayamupondi Thana Svaroopamunaku Maarchabadutache 3. Parishuddhalagutaku Manala Pilichi - Thana Aathma Dvaaraa Nadipinchenu Devuni Pillalamani Saakshamichchenu Kreesthulo Mahima Parachabadutaku 4. Devuni Intiga Kattabaduchunnaamu - Sahavaasamulo Nilichi Yundi Sodara Premalo Vinaya Manaskulai Aasheervaadamunaku Vaarasulamavutaku 5. Mana Pathanamulu Paapamulabatti - Yinti Godalu Beetalu Vaarenu Mana Athikramamunu Oppukondumu Lokamu Nundi Veraina Vaaramai 6. Mana Prabhu Yesu Vachchuchundagaa - Thvaragaa Rammani Eduru Choothamu Shathruvunu Dhairyamutho Edurkonedamu Vinaya Vidheyatha Kaligiyundi 7. Siddhapadudi Daiva Janamaa - Buddhi Kaligina Kanyakala Vale Siddelalona Noonenu Galigi Melakuva Kaligi Siddhapaatutho