పైలం కొడుకా - YouWorship
Pailam Kodukaa
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
పైలం కొడుకా పాపం చేయకురా యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా పైలం కొడుకా పైలం కొడుకా పైలం కొడుకా పైలం కొడుకా పైలం కొడుకా పాపం చేయకురా యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా నీ మనసు మార్చుకొని మంచిగా బతుకురా ఉడుకు రక్తము ఉరుకలు పెడ్తది పాపం చెయ్యమని ఒత్తిడి చేస్తది పాపమన్నది పాములాంటిది పగ పడ్తది ప్రాణం తీస్తది ||పైలం|| మనిషి జీవితం విలువయ్యింది మరువకు కొడుకా మరణమున్నదని బ్రతికింది ఇది బ్రతుకు కాదురా సచ్చినంక అసలాట ఉంటది ||పైలం|| కత్తి కన్న పదునెక్కువ కొడుకా మనిషి కోపము మంచిది కాదు కాలు జారితే తీసుకోవచ్చురా నోరు జారితే తీసుకోలేము ||పైలం|| క్రైస్తవ జీవితం విలువయ్యింది నిప్పులాగ బ్రతకాలిరా కొడుకా నిప్పులాగ బ్రతకాలిరా కొడుకా నిందలన్ని మొయ్యాలిరా కొడుకా ||పైలం|| విచ్చలవిడిగా తిరుగుతున్నావు ఎవరు చూడరని ఎగురుతున్నావు చూసే దేవుడేసయ్య ఉన్నడు తోలు తీస్తడు జాగ్రత్త కొడుకా ||పైలం|| గుట్కలు తినకురా గుటుక్కున చస్తావు పొగాకు తినకురా పోతవు నరకం సినిమా చూడకు చింతలు తప్పవు ఫోజులు కొట్టకు పోతవు నరకం ||పైలం|| కుమ్మరి పురుగు గుణం చూడరా బురదల ఉంటది బురదే అంటదు తామెర పువ్వు బురుదల ఉంటది వరదొస్తే తల వంచుకుంటది ||పైలం|| ఎన్నో ఆశలు పెట్టుకున్నరా సేవ చేస్తే నిను చూడాలని నా కలలను కల్ల చెయ్యకు కొడుకా కాళ్ళు మొక్కుతా మయ్యగానిరా ||పైలం|| పొందుకున్నవు రక్షణ నీవు పోగొట్టుకోకు పోతవు నరకం నరకమంటే ఆషామాషీ కాదురో అగ్ని ఆరదు పురుగు చావదు ||పైలం|| ప్రపంచమంతటా పాపమున్నది మందులేని మాయ రోగమున్నది నీ పచ్చని జీవితం పాడు చేసుకోకు ఓ కొడకా నీవు మంచిగా బ్రతికేసయ్యను మహిమపరచు నా కొడకా నీవు సి ఎం అయితే సంతోషముండదు పి ఎం అయితే సంతోషముండదు యాక్టర్ అయితే సంతోషముండదు డాక్టర్ అయితే సంతోషముండదు నీవు సేవ చేస్తే నేను చూడాలి కొడుకా నువ్వు శ్రమలు అనుభవించాలిరా నా కొడుకా ||పైలం|| Pailam Kodukaa Paapam Cheyyakuraa Yesayyanu Nammukoni Manchiga Bathukuraa Pailam Kodukaa Pailam Kodukaa Pailam Kodukaa Pailam Kodukaa Pailam Kodukaa Paapam Cheyyakuraa Yesayyanu Nammukoni Manchiga Bathukuraa Nee Manasu Maarchukoni Manchiga Brathukuraa Uduku Rakthamu Urukalu Pedthadi Paapam Cheyyamani Votthidi Chesthadi Paapamannadi Paamulaantidi Paga padthadi Praanam Theesthadi ||Pailam|| Manishi Jeevitham Viluvayyindi Maruvaku Kodukaa Maranamunnadani Brathikindi Idi Brathuku Kaaduraa Sachchinanka Asalaata Untadi ||Pailam|| Katthi Kanna Padunekkuva Kodukaa Manishi Kopamu Manchidi Kaadu Kaalu Jaarithe Theesukovachchuraa Noru Jaarithe Theesukolemu ||Pailam|| Kraisthava Jeevitham Viluvayyindi Nippulaaga Brathakaaliraa Kodukaa Nippulaaga Brathakaaliraa Kodukaa Nindalanni Moyaaliraa Kodukaa ||Pailam|| Vichchalavidigaa Thiruguthunnavu Evaru Choodarani Eguruthunnavu Choose Devudesayya Unnadu Tholu Theesthadu Jaagrattha Kodukaa ||Pailam|| Gutkalu Thinakuraa Guttukuna Chasthavu Pogaaku Thinakuraa Pothavu Narakam Cinimaa Choodaku Chinthalu Thappavu Phosulku Kottaku Pothavu Narakam ||Pailam|| Kummari Purugu Gunam Choodaraa Buradala Untadi Burade Antadu Thaamera Puvvu Burudala Untadi Varadosthe Thala Vanchukuntadi ||Pailam|| Enno Aashalu Pettukunnaraa Seva Chesthe Ninu Choodaalani Naa Kalalnu Kalla Cheyyaku Kodukaa Kaallu Mokkuthaa Mayyagaaniraa ||Pailam|| Pondukunnavu Rakshana Neevu Pogottukoku Pothavu Narakam Narakamante Aashaamaashee Kaaduro Agni Aaradu Purugu Chaavadu ||Pailam|| Prapanchamanthata Paapamunnadi Manduleni Maaya Rogamunnadi Nee Pachchani Jeevitham Paadu Chesukoku O Kodakaa Neevu Manchiga Brathikesayyanu Mahimaparachu Naa Kodakaa Neevu CM Aithe Santhoshamundadu PM Aithe Santhoshamundadu Actor Aithe Sathoshamundadu Doctor Aithe Santhoshamundadu Neevu Seva Chesthe Nenu Choodaali Kodukaa Nuvvu Shramalu Anubhavinchaalira Naa Kodukaa ||Pailam||