పేతురు వలె నేను - YouWorship
Pethuru Vale Nenu
Artist: జాస్పర్ కునపో
Category: Repentance
Song Lyrics
ఆరాధ్యుడవు నీవే ప్రభు ఆనందముతో ఆరాధింతును (2) అత్యున్నత ప్రేమను కనుపరచినావు నిత్యము నిను కొనియాడి కీర్తింతును (2) ||ఆరాధ్యుడవు|| పేతురు వలె నేను ప్రభునకు దూరముగా పనులతో జనులతో జతబడి పరుగెత్తగా (2) ప్రయాసమే ప్రతిక్షణం ప్రతి నిమిషం పరాజయం గలిలయ తీరమున నన్ను గమనించితివా (2) ||ఆరాధ్యుడవు|| ప్రభురాకడ నెరిగి జలజీవరాసులు తీరము చేరిరి కర్తను తేరి చూడగా (2) పరుగెత్తెను పలు చేపలు ప్రభు పనికై సమకూడి సంతోషముతో ఒడ్డున గంతులేసెను (2) ||ఆరాధ్యుడవు|| నిన్నెరుగను అని పలికి అన్యునిగా జీవించితి మీనముతో భోజనము సమకూర్చితివా (2) ఆచేపల సమర్పణ నేర్చితి నిను వెంబడింతు అద్వితీయ దేవుడవు నీవే ప్రభు (2) ||ఆరాధ్యుడవు|| Aaraadhyudavu Neeve Prabhu Aanandamutho Aaraadhinthunu (2) Athyunnatha Premanu Kanuparachinaavu Nithyamu Ninu Koniyaadi Keerthinthunu (2) ||Aaraadhyudavu|| Pethuru Vale Nenu Prabhunaku Dooramugaa Panulatho Janulatho Jathabadi Parugetthagaa (2) Prayaasame Prathikshanam Prathi Nimisham Paraajayam Galilaya Theeramuna Nannu Gamaninchithivaa (2) ||Aaraadhyudavu|| Prabhu Raakada Nerigi Jalajeevaraasulu Theeramu Cheriri Karthanu Theri Choodagaa (2) Parugetthenu Palu Chepalu Prabhu Panikai Samakoodi Santhoshamutho Odduna Ganthulesenu (2) ||Aaraadhyudavu|| Ninneruganu Ani Paliki Anyunigaa Jeevinchithi Meenamutho Bhojanamu Samakoorchithivaa (2) Aa Chepala Samarpana Nerchithi Ninu Vembadinthu Advitheeya Devudavu Neeve Prabhu (2) ||Aaraadhyudavu||