పూర్వమాశీర్వాదము నేడు శ్రీయేసే. - YouWorship
Poorvamaasheervaadamu Nedu Shreeyese.
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: సర్వములో సర్వదా - యేసునే పాడెద యేసులో సమస్తము - సమస్తము యేసే 1. పూర్వమాశీర్వాదము - నేడు శ్రీయేసే మున్ను నా యాలోచన - నేడు తనమాట మున్ను వరము కోరితి - నే డొసగు వానిన్ మున్ను స్వస్థత కోరితి - నేడు వానినే 2. మున్ను శోధన శ్రమ - నేడు నమ్మకం ముందు అర్థరక్షణ - నేడు సంపూర్ణం మున్ను విడువనిపట్టు - నేడేసు నన్ బట్టెన్ పూర్వము నే నస్థిరం - నేడు - స్థిరమైతి ||సర్వములో|| 3. మున్నునా ప్రయత్నము - నేడు ప్రార్థన పూర్వమెంతో జాగ్రత్త - నేడతని శ్రద్ధ మున్ను నాదుకోరిక - నేడేసుమాట పూర్వ మడుగుచుండుట - నేడు సంస్తుతి ||సర్వములో|| 4. మున్ను నాపనియది - యికను తన పని మున్ను తనను వాడితిన్ - నేడు నన్ వాడును మున్ను శక్తి కోరితిన్ - నేడు శక్తునే మున్ను నాకై చేసితిన్ - నేడు తనకే ||సర్వములో|| 5. మున్ను యేసును కోరితిన్ - నా వాడాయె నేడు మున్ను జ్యోతులుగ నుండే - నే డేంతో కాంతి మున్ను చావు గోరితి - నేడు తన రాకన్ నా నిరీక్షణలెల్ల - స్థిరమాయెను ||సర్వములో|| Pallavi: Sarvamulo Sarvadaa - Yesune Paadeda Yesulo Samasthamu - Samasthamu Yese 1. Poorvamaasheervaadamu - Nedu Shreeyese Munnu Naa Yaalochana - Nedu Thanamaata Munnu Varamu Korithi - Ne Dosagu Vaanin Munnu Svasthatha Korithi - Nedu Vaanine 2. Munnu Shodhana Shrama - Nedu Nammakan Mundu Artharakshana - Nedu Sampoornan Munnu Viduvanipattu - Nedesu Nan Batten Poorvamu Ne Nasthiran - Nedu - Sthiramaithi ||Sarvamulo|| 3. Munnunaa Prayathnamu - Nedu Praarthana Poorvamentho Jaagraththa - Nedathani Shraddha Munnu Naadukorika - Nedesumaata Poorva Maduguchunduta - Nedu SanSthuthi ||Sarvamulo|| 4. Munnu Naapaniyadi - Yikanu Thana Pani Munnu Thananu Vaadithin - Nedu Nan Vaadunu Munnu Shakthi Korithin - Nedu Shakthune Munnu Naakai Chesithin - Nedu Thanake ||Sarvamulo|| 5. Munnu Yesunu Korithin - Naa Vaadaaye Nedu Munnu Jyothuluga Nunde - Ne Dentho Kaanthi Munnu Chaavu Gorithi - Nedu Thana Raakan Naa Nireekshanalella - Sthiramaayenu ||Sarvamulo||