పాహిలోక ప్రభో - YouWorship
Paahiloka Prabho
Artist: బన్యన్ జోసఫ్
Category: Praise
Song Lyrics
పాహిలోక ప్రభో - పాహి లోక ప్రభో పాహి యని వేడు మాం - పాహిలోక ప్రభో 1. నిన్ను స్తుతియించుచు - నీవు ప్రభుండవని చెన్నుమీరంగ నమ్మియున్నాము సత్ప్రభో 2. నిత్య మా తండ్రి భూలోకంబంతయు నిన్ను భక్తితో నారాధించుచున్నది మా ప్రభో 3. దేవ లోకాధిపతులు - దూతల సమూహము దేవా యని కొల్చుచున్నారు నిన్ను ప్రభో 4. పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా పరలోక సేనాధిపతి వైన మా ప్రభో 5. ఇహలోకం బంతయు - పరలోకం బంతయు నీ మహి మహాత్మ్యముతో నున్నవని ప్రభో 6. కెరూబులను దూతలు - సెరూపులను దూతలు తిరముగా నిన్ గొనియాడుచున్నారు మా ప్రభో 7. నీ దపొస్తలుల - మహిమగల సంఘము ప్రోదిగా నిన్నుతించుచున్నది మా ప్రభో 8. నిత్యము ప్రవక్తల - యుత్తమ సంఘము సత్యముగ నిన్నుతించుచున్నది మా ప్రభో 9. ధీర హత సాక్షుల - వీర సైన్య మంతయు సారెకు నిన్నుతించుచున్నది మా ప్రభో 10. నిత్య మహాత్మ్యముగల - తండ్రి వైన నిన్నును నీదు పూజ్యుండగు నిజ అద్వితీయ సుతునిన్ 11. ఆదరణ కర్తయె నట్టి శుద్ధాత్ముని నంతట నుండు సభ యొప్పుకొనును నిన్ ప్రభో Paahiloka Prabho - Paahi Loka Prabho Paahi Yani Vedu Maam - Paahiloka Prabho 1. Ninnu Sthuthiyimchuchu - Neevu Prabhumdavani Chennumeeramga Nammiyunnaamu Sathprabho 2. Nithya Maa Thamdri Bhoolokambamthayu Ninnu Bhakthitho Naaraadhimchuchunnadi Maa Prabho 3. Deva Lokaadhipathulu - Doothala Samoohamu Devaa Yani Kolchuchunnaaru Ninnu Prabho 4. Parishuddha Parishuddha - Parishuddha Prabhuvaa Paraloka Senaadhipathi Vaina Maa Prabho 5. Ihalokam Bamthayu - Paralokam Bamthayu Nee Mahi Mahaathmyamutho Nunnavani Prabho 6. Keroobulanu Doothalu - Seroopulanu Doothalu Thiramugaa Nin Goniyaaduchunnaaru Maa Prabho 7. Nee Daposthalula - Mahimagala Samghamu Prodigaa Ninnuthimchuchunnadi Maa Prabho 8. Nithyamu Pravakthala - Yuththama Samghamu Sathyamuga Ninnuthimchuchunnadi Maa Prabho 9. Dheera Hatha Saakshula - Veera Sainya Mamthayu Saareku Ninnuthimchuchunnadi Maa Prabho 10. Nithya Mahaathmyamugala - Thamdri Vaina Ninnunu Needu Poojyumdagu Nija Advitheeya Suthunin 11. Aadarana Karthaye Natti Shuddhaathmuni Namthata Numdu Sabha Yoppukonunu Nin Prabho