పాపిని నేను తప్పితి - YouWorship
Paapini Nenu Thappithi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: పాపిని నేను తప్పితి - భువిలో రక్షించెడి వారెవరు (1) ఓ ప్రభు యేసు నిరీక్షణతో - నీ దరికి జేరితిని (2) 1. ప్రభువా పాపిని రక్షించుటకు - ఈ భువి కరుదెంచితివి (2) దౌర్భాగ్యుడను వేడితి శరణం - వేరేమి చేయలేను (2) 2. జీవము నివ్వ వచ్చితివి - చచ్చి యుంటి నేను బంధింపబడితిని మరణ బంధముతో - విడిపించెడి వారెవరు 3. జన్మముతోనే అపవిత్రుడను - నా స్వభావమే క్రియలలోను మాటలయందు - నీకు విరోధినైతిని 4. స్వంత నీతితో నిండిన పనులు - మరి పుణ్య కార్యములు ఆచారములతో చిక్కుకొన్నాను - తప్పించెడి వారెవరు 5. భరియించితివి పాపపు శిక్ష - ప్రాణమిచ్చితివి నాకై రక్తము కార్చి సర్వమిచ్చితివి - నన్ను రక్షించుటకై 6. ఓ ప్రభు యేసు దయాళుడ వీవు - కృంగివచ్చుచున్నాను నా పాపములు క్షమియించు ప్రభువా - గొప్ప రక్షణకర్త వీవే Pallavi: Paapini Nenu Thappithi - Bhuvilo Rakshinchedi Vaarevaru (1) O Prabhu Yesu Nireekshanatho - Nee Dariki Jerithini (2) 1. Prabhuvaa Paapini Rakshinchutaku - Ee Bhuvi Karudenchithivi (2) Daurbhaagyudanu Vedithi Sharanan - Veremi Cheyalenu (2) 2. Jeevamu Nivva Vachchithivi - Chachchi Yunti Nenu Bandhimpabadithini Marana Bandhamutho - Vidipinchedi Vaarevaru 3. Janmamuthone Apavithrudanu - Naa Svabhaavame Kriyalalonu Maatalayandu - Neeku Virodhinaithini 4. Svantha Neethitho Nindina Panulu - Mari Punya Kaaryamulu Aachaaramulatho Chikkukonnaanu - Thappinchedi Vaarevaru 5. Bhariyinchithivi Paapapu Shiksha - Praanamichchithivi Naakai Rakthamu Kaarchi Sarvamichchithivi - Nannu Rakshinchutakai 6. O Prabhu Yesu Dayaaluda Veevu - Krunggivachchuchunnaanu Naa Paapamulu Kshamiyinchu Prabhuvaa - Goppa Rakshanakartha Veeve