పాతాళంలో ఆత్మల ఆర్తనాదం - YouWorship
Paathaalamlo Aathmala Aartha Naadam
Artist: సత్య వేద సాగర్
Category: Gospel
Song Lyrics
పాతాళంలో ఆత్మల ఆర్తనాదం భూలోకంలో సువార్తల సునాదము (2) మించుతుంది సమయం – పొంచి ఉంది ప్రమాదం ఎంచుకో స్వర్గం – నరకం (2) గమనించుకో ఎటు నీ పయనం ||పాతాళంలో|| ఆరని అగ్ని తీరని బాధ పాతాళమందున్నది విందు వినోదం బంధువు బలగం ఈ లోకమందున్నది (2) రక్షణను పొందమంటే పొందుకోరు ఇక్కడ రక్షించే వారులేక రోధిస్తారక్కడ (2) ||పాతాళంలో|| ఇది రంగుల లోకం హంగులు చూపి రమ్మని పిలుస్తున్నది వాక్యము ద్వారా దేవుడు పిలచినా ఈ లోకం వినకున్నది (2) ప్రజల కొరకు పాతాళం నోరు తెరుచుకున్నది ఎంత చెప్పినా లోకం కళ్ళు తెరవకున్నది (2) ||పాతాళంలో|| Paathaalamlo Aathmala Aartha Naadam Bhoo Lokamlo Suvaarthala Sunaadamu (2) Minchuthundi Samayam – Ponchi Undi Pramaadam Enchuko Swargam – Narakam (2) Gamaninchuko Etu Nee Payanam ||Paathaalamlo|| Aarani Agni Theerani Baadha Paathaalamandunnadi Vindu Vinodam Bandhuv Balagam Ee Lokamandunnadi (2) Rakshananu Pondmante Pondukoru Ikkada Rakshinche Vaaru Leka Rodhisthaarakkada (2) ||Paathaalamlo|| Idi Rangula Lokam Hangulu Choopi Rammani Pilusthunnadi Vaakyamu Dwaaraa Devudu Pilachinaa Ee Lokam Vinakunnadi (2) Prajala Koraku Paathaalam Noru Theruchukunnadi Entha Cheppinaa Lokam Kallu Theravakunnadi (2) ||Paathaalamlo||