పాడెద దేవా నీ కృపలన్ - YouWorship
Paadeda Devaa Nee Krupalan
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
పాడెద దేవా – నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ – స్తుతి స్తోత్రము చెల్లింతున్ (2) భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివి (2) ప్రేమ పునాదులు వేసితివి దీనుని బ్రోచితివి – ఈ దీనుని బ్రోచితివి (2) ||పాడెద|| ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నిచ్చితివి (2) ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి – నా పాపము తుడిచితివి (2) ||పాడెద|| పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి (2) అపరాధములచే చచ్చిన నన్ను ధర బ్రతికించితివి – నన్ను బ్రతికించితివి (2) ||పాడెద|| దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి (2) చీకటి రాజ్యపు శక్తుల నుండి నను విడిపించితివి – చెర నను విడిపించితివి (2) ||పాడెద|| ముద్రించితివి శుద్ధాత్మతో నను భద్రము చేసితివి (2) సత్యస్వరూప నిత్యనివాసి సొత్తుగా చేసితివి – నీ సొత్తుగా చేసితివి (2) ||పాడెద|| అన్యుడనై నిను ఎరుగక యున్నను ధన్యుని చేసితివి (2) ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరముల నొసగితివి – కృప వరముల నొసగితివి (2) ||పాడెద|| Paadeda Devaa Nee Krupalan Noothana Geethamulan Sthothramu Chellinthun – Sthuthi Sthothramu Chellinthun (2) Bhoomi Punaadulu Veyaka Munde Yesulo Chesithivi (2) Prema Punaadulu Vesithivi Deenuni Brochithivi – Ee Deenuni Brochithivi (2) ||Paadeda|| Pravimala Rakthamu Kaluvari Siluvalo Khalunaku Nichchithivi (2) Prema Krupaa Mahadaishwaryamulatho Paapamu Thudichithivi – Naa Paapamu Thudichithivi (2) ||Paadeda|| Paapamu Shaapamu Narakapu Vedhana Mari Tholaginchithivi (2) Aparaadhamulache Chachchina Nannu Dhara Brathikinchithivi – Nannu Brathikinchithivi (2) ||Paadeda|| Devuni Raajyapu Vaarasudanugaa Kreesthulo Chesithivi (2) Cheekati Raajyapu Shakthula Nundi Nanu Vidipinchithivi – Chera Nanu Vidipinchithivi (2) ||Paadeda|| Mudrinchithivi Shuddhaathmatho Nanu Bhadramu Chesithivi (2) Sathya Swaroopi Nithya Nivaasi Sotthugaa Chesithivi – Nee Sotthugaa Chesithivi (2) ||Paadeda|| Anyudanai Ninu Erugaka Yunnanu Dhanyuni Chesithivi (2) Priya Pattana Pourula Sevimpanu Varamula Nosagithivi – Krupa Varamula Nosagithivi (2) ||Paadeda||