పల్లవరపు కొండలపైన - YouWorship
Pallavarapu Kondalapaina
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: పల్లవరపు కొండలపైన - ప్రభుచూపిన దర్శమలం అహ పల్లవరపు కొండలపైన - పరలోక సంఘదర్శనమిచ్చెన్ (2) అను పల్లవి: తొలిప్రేమ కలిగి అందరము - బలియైన క్రీస్తును ప్రకటించి (2) మారాను పోలిన శ్రమలున్నా - కానాను పురముకు చేరుదము (2) 1. అపొస్తలుల బోధ - సహవాసము ప్రభు బల్ల ప్రార్థన జీవితము - సంఘ దర్శనమునకు మూలం (2) ఈ ఆత్మీయ లంగరులను కలిగి - కొనసాగెదము తుఫానులలో ఈ ఆత్మీయ లంగరులను కలిగి - ఈ పాప సముద్రము దాటెదము 2. విశ్వాసము ప్రేమ - నిరీక్షణ నిలుచునిల అపకారము మాని - డంబమును విడచెదము సోదర ప్రేమలేనిచో - వ్యర్థులము మన మీ లోకములో సోదర ప్రేమలేనిచో మ్రోగెడి తాళము వలె నుండెదము 3. దేవుని చిత్తమును - ఎరిగి జీవించెదము ప్రభు చిత్తము కొరకు - చెల్లించెదము క్రయము దేవా నీ చిత్తము నెరవేర్చ - మాకెంతో సంతోషము దేవా నీ చిత్తము నెరవేర్చ - నీకెంతో సంతోషము 4. దేవుని మందిరమున్ - ప్రేమించెదమెల్లప్పుడు దేవుని వాక్యమును - ఆలయములో ధ్యానింతుము చిరకాలము దేవుని మందిరములో - నివసించి స్తుతియించెదము చిరకాలము దేవుని మందిర తేజో- మహిమలో వసియించెదము 5. ఆత్మతో సత్యముతో - నిజ ఆరాధన కలిగి యధార్థ హృదయముతో - మంచి సాక్ష్యమును కలిగి పెదవుల పదములు కాదని - మన హృదయములను అర్పించెదము పెదవుల పదములు కాదని - హెబ్రోను ప్రభుని కొనియాడెదము 6. చెప్పనశక్యమును - మహిమా యుక్తమునైన సంతోషము కలిగి సువార్తను చాటెదము ఆకాశము క్రింద ఏ నామమున - రక్షణ లేదని చాటెదము ఆకాశము క్రింద యేసు నామమునే - పాపక్షమాపణ కలుగునని 7. పేరున పిలిచితివి - నీ దాసుని సేవకై సార్వత్రికమందు - సంఘమునకు ఏర్పరచ ఆనంద భాష్పములతో మేము - ఆత్మీయ తండ్రిని స్మరియింతుము ఆనంద భాష్పములతో మేము ఆయన బోలి నడిచెదము Pallavi: Pallavarapu Kondalapaina - Prabhuchoopina Darshamalan Aha Pallavarapu Kondalapaina - Paraloka Sangghadarshanamichchen (2) Anu Pallavi: Tholiprema Kaligi Andaramu - Baliyaina Kreesthunu Prakatinchi (2) Maaraanu Polina Shramalunnaa - Kaanaanu Puramuku Cherudamu (2) 1. Aposthalula Bodha - Sahavaasamu Prabhu Balla Praarthana Jeevithamu - Sanggha Darshanamunaku Moolan (2) Ee Aathmaya Langgarulanu Kaligi - Konasaagedamu Thuphaanulalo Ee Aathmaya Langgarulanu Kaligi - Ee Paapa Samudramu Daatedamu 2. Vishvaasamu Prema - Nireekshana Niluchunila Apakaaramu Maani - Dambamunu Vidachedamu Sodara Premalenicho - Vyarthulamu Mana Mee Lokamulo Sodara Premalenicho Mrogedi Thaalamu Vale Nundedamu 3. Devuni Chiththamunu - Erigi Jeevinchedamu Prabhu Chiththamu Koraku - Chellinchedamu Krayamu Devaa Nee Chiththamu Neravercha - Maakentho Santhoshamu Devaa Nee Chiththamu Neravercha - Neekentho Santhoshamu 4. Devuni Mandiramun - Preminchedamellappudu Devuni Vaakyamunu - Aalayamulo Dhyaaninthumu Chirakaalamu Devuni Mandiramulo - Nivasinchi Sthuthiyinchedamu Chirakaalamu Devuni Mandira Thejo- Mahimalo Vasiyinchedamu 5. Aathmatho Sathyamutho - Nija Aaraadhana Kaligi Yadhaartha Hrudayamutho - Manchi Saakshyamunu Kaligi Pedavula Padamulu Kaadani - Mana Hrudayamulanu Arpinchedamu Pedavula Padamulu Kaadani - Hebronu Prabhuni Koniyaadedamu 6. Cheppanashakyamunu - Mahimaa Yukthamunaina Santhoshamu Kaligi Suvaarthanu Chaatedamu Aakaashamu Krinda E Naamamuna - Rakshana Ledani Chaatedamu Aakaashamu Krinda Yesu Naamamune - Paapakshamaapana Kalugunani 7. Peruna Pilichithivi - Nee Daasuni Sevakai Saarvathrikamandu - Sangghamunaku Erparacha Aananda Bhaashpamulatho Memu - Aathmaya Thandrini Smariyinthumu Aananda Bhaashpamulatho Memu Aayana Boli Nadichedamu