పరుగిడిరా సోదరుడా - YouWorship
Parugidiraa Sodarudaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: పరుగిడిరా సోదరుడా (1) ప్రభు సన్నిధి నీవు జేరుటకై (2) - పరుగిడరా .. 1. యుగసమాప్తికి ఆగమనమునకు - సూచన లెన్నో చూడుమురా (2) వేదన లెన్నో మీదికి వచ్చురా (2) - కలవర మొందక కని పెట్టుమురా (2) 2. ఇండ్లను గట్టుచు పెండ్లికి యిచ్చుచు - నారును నాటుచు త్రాగుచు తినుచు జగములో జనులు దిగులు లేనప్పుడు - దొంగవలె యిల దొరయై వచ్చురా 3. ఆ దినమైనను ఆ గడియైనను - పరమున దూతలు ధరణిలో మనుజులు ఎవరునుగాని ఎరుగనె ఎరుగరు - మెలకువతో యేసు పిలుపును వినుచు 4. ఆ దినముల శ్రమ అంతము కాగ - సూర్యుని చంద్రుని చీకటి కమ్ము ఆకసమందలి శక్తులు కదలును - మహిమతో యేసు యిమ్మహిదిగురా 5. ఆర్భాటముతో ఆశ్చర్యముతో - దేవుని బూరతో మనప్రభు దిగురా క్రీస్తు నందున్న మృతులగువారు - ఏకముగ ప్రభు యేసుని జేర 6. ఎటుచూచిన నీకటు కనిపించును - కొండల బండల నుండినను కొదమ సింహమై కోపాగ్నియై - ఎదురుగ వచ్చిన కదలగ లేవురా 7. ఎత్తబడుట కాయత్తమా నీవు - తరుణము యిదియే తడవు చేయకురా రక్షణలో నిరీక్షణ కలిగి - రక్షకు డేసుని రాజ్యము చేర Pallavi: Parugidiraa Sodarudaa (1) Prabhu Sannidhi Neevu Jerutakai (2) - Parugidaraa .. 1. Yugasamaapthiki Aagamanamunaku - Soochana Lenno Choodumuraa (2) Vedana Lenno Meediki Vachchuraa (2) - Kalavara Mondaka Kani Pettumuraa (2) 2. Indlanu Gattuchu Pendliki Yichchuchu - Naarunu Naatuchu Thraaguchu Thinuchu Jagamulo Janulu Digulu Lenappudu - Donggavale Yila Dorayai Vachchuraa 3. Aa Dinamainanu Aa Gadiyainanu - Paramuna Doothalu Dharanilo Manujulu Evarunugaani Erugane Erugaru - Melakuvatho Yesu Pilupunu Vinuchu 4. Aa Dinamula Shrama Anthamu Kaaga - Sooryuni Chandruni Cheekati Kammu Aakasamandali Shakthulu Kadalunu - Mahimatho Yesu Yimmahidiguraa 5. Aarbhaatamutho Aashcharyamutho - Devuni Booratho ManaPrabhu Diguraa Kreesthu Nandunna Mruthulaguvaaru - Ekamuga Prabhu Yesuni Jera 6. Etuchoochina Neekatu Kanipinchunu - Kondala Bandala Nundinanu Kodama Sinhamai Kopaagniyai - Eduruga Vachchina Kadalaga Levuraa 7. Eththabaduta Kaayaththamaa Neevu - Tharunamu Yidiye Thadavu Cheyakuraa Rakshanalo Nireekshana Kaligi - Rakshaku Desuni Raajyamu Chera