పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము - YouWorship
Parishuddha Sthalamu Athi Parishuddha Sthalamu
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: పరిశుద్ధ స్థలము - అతి పరిశుద్ధ స్థలము (2) దేవాదిదేవుడున్నట్టి స్థలము (2) అతి పరిశుద్ధంబైన పరలోకము (2) 1. ప్రభు యేసు వచ్చెను ఆ స్థలమునుండియే - స్థలము లేనివాడుగా ఈ భువిపై నుండెను (2) ప్రాణము నర్పించెను కలువరి కొండపై (2) శత్రు గర్వమణచను సజీవుడై లేచెను (2) 2. ప్రభుయేసు వెళ్లెనటకు స్థలము సిద్ధపరచను - ఆయనుండు స్థలములో మనముండవలెనని శోధన వేదన భాద లేని స్థలమది ఆ స్థలమునకెళ్లుటకు ప్రయాసపడుదమా 3. అబ్రహాము చూచెను ఆ స్థలమును - మోషే చూచి వచ్చెను దాని వైభవంబును హానోకు ఏలీయాలు వెళ్లిరి అటకు పౌలు చూచి వచ్చెనా మహిమకర స్థలమును 4. సూర్యచంద్రులక్కర లేని స్థలము అది - పాపము చీకటి చొరని శుద్ధ స్థలమది గొర్రెపిల్ల దీపమై వెలుగునిచ్చు నచట జయశాలులెల్లరూ సంచరింతురచట 5. జీవవృక్షఫలములు దొరకునట్టి స్థలమది - జీవనది పారుచుండు నెల్లవేళలా నిశేధించ బడినవారు చొరని స్థలమది నిత్యజీవమొందువారే ప్రవేశింతురందున 6. పండ్రెండు పునాదుల పట్టణము అది - పండ్రెండు ముత్యములతో కట్టబడినది పండ్రెండు గుమ్మముల ప్రాంగణమది హల్లెలూయ పాడుచూ ఆరాధింతుమచట Pallavi: Parishuddha Sthalamu - Athi Parishuddha Sthalamu (2) DevaadiDevudunnatti Sthalamu (2) Athi Parishuddhambaina Paralokamu (2) 1. Prabhu Yesu Vachchenu Aa Sthalamunundiye - Sthalamu Lenivaadugaa Ee Bhuvipai Nundenu (2) Praanamu Narpinchenu Kaluvari Kondapai (2) Shathru Garvamanachanu Sajeevudai Lechenu (2) 2. PrabhuYesu Vellenataku Sthalamu Siddhaparachanu - Aayanundu Sthalamulo Manamundavalenani Shodhana Vedana Bhaada Leni Sthalamadi Aa Sthalamunakellutaku Prayaasapadudamaa 3. Abrahaamu Choochenu Aa Sthalamunu - Moshe Choochi Vachchenu Daani Vaibhavambunu Haanoku Eleeyaalu Velliri Ataku Paulu Choochi Vachchenaa Mahimakara Sthalamunu 4. Sooryachandrulakkara Leni Sthalamu Adi - Paapamu Cheekati Chorani Shuddha Sthalamadi Gorrepilla Deepamai Velugunichchu Nachata Jayashaalulellaroo Sancharinthurachata 5. Jeevavrukshaphalamulu Dorakunatti Sthalamadi - Jeevanadi Paaruchundu Nellavelalaa Nishedhincha Badinavaaru Chorani Sthalamadi Nithyajeevamonduvaare Praveshinthuranduna 6. Pandrendu Punaadula Pattanamu Adi - Pandrendu Muthyamulatho Kattabadinadi Pandrendu Gummamula Praangganamadi Hallelooya Paaduchoo Aaraadhinthumachata