పరిశుద్ధ శ్రీ యేసువే పరలోకరాజు - YouWorship
Parishuddha Shree Yesuve Paralokaraaju
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: పరిశుద్ధ శ్రీ యేసువే - పరలోకరాజు మురియుచు నే పూజింతును - నిరతము - పరిశుద్ధ శ్రీ యేసువే (1) అను పల్లవి: పరలోక మహిమనుండి - నరుల రాజ్యములలో (2) నిరతము తన పాలనము జరిగించుచున్నరాజు (2) 1. పెనూయేలు పోరాటంబున - పోనివ్వనంచు - పెనుగునందున యాకోబు - వినయమున (2)- పెనూయేలు పోరాటంబున (1) నన్ను దీవించు తండ్రీ - నిన్ను నే విడువనంచు (2) కన్నీటితో వేడగా - ఘనత ఇశ్రాయేలనియె (2) 2. ఈ దినమున నుండి - పదిలముగ - ముదముగ దీవింతుననెన్ - ఆదరణకర్త - ఈ దినమున నుండి తుదిమందిర పునాదిపై - కదలక నిలుచువారిన్ కదలని నా పునాది - యూదాగోత్ర సింహంబు 3. సీయోనులోనుండి - ప్రియుడైన యేసు - కాయుచు నిను దీవించును - ఆయన త్రోవన్ - సీయోనులోనుండి పాయక నిన్నెప్పుడు - పరిపాలించు చుండును రయమున నిన్ను జేరి - సాయంబు చేయుచుండు 4. జయించుచున్న వానికి - మరుగైన మన్నా ప్రియమున భజియింపనిచ్చున్ - జయశాలి- జయించుచున్న వానికి వ్రాయబడిన క్రొత్తనామ మున్నట్టి తెల్ల రాయినొసంగి వాని భయము తొలగించు జయము " 5. నడిపించుచుండె నిత్యము - తన దృష్టి నిలిపి విడువకుండగ నీ ప్రభు - కడవరకు - నడిపించుచుండె నిత్యము ఎడతెగని తనదు ప్రేమ - కనుపరచి తృప్తిపరచి చెడుగునెల్లను బాపి - తన యడుగు జాడలలో 6. బలము నారోపించుము - బలమిచ్చు ప్రభువు - సిలువలో నీకై సమసెను - సీయోను - బలము నారోపించుము గెలిచె సమాధినుండి - బలముతో తిరిగిలేచె ఎల్ల మేలుల తలచి - హల్లెలూయ పాడెదము Pallavi: Parishuddha Shree Yesuve - Paralokaraaju Muriyuchu Ne Poojinthunu - Nirathamu - Parishuddha Shree Yesuve (1) Anu Pallavi: Paraloka Mahimanundi - Narula Raajyamulalo (2) Nirathamu Thana Paalanamu Jariginchuchunnaraaju (2) 1. Penooyelu Poraatambuna - Ponivvananchu - Penugunanduna Yaakobu - Vinayamuna (2)- Penooyelu Poraatambuna (1) Nannu Deevinchu Thandree - Ninnu Ne Viduvananchu (2) Kanneetitho Vedagaa - Ghanatha Ishraayelaniye (2) 2. Ee Dinamuna Nundi - Padilamuga - Mudamuga Deevinthunanen - Aadaranakartha - Ee Dinamuna Nundi Thudimandira Punaadipai - Kadalaka Niluchuvaarin Kadalani Naa Punaadi - Yoodaagothra Sinhambu 3. Seeyonulonundi - Priyudaina Yesu - Kaayuchu Ninu Deevinchunu - Aayana Throvan - Seeyonulonundi Paayaka Ninneppudu - Paripaalinchu Chundunu Rayamuna Ninnu Jeri - Saayambu Cheyuchundu 4. Jayinchuchunna Vaaniki - Marugaina Mannaa Priyamuna Bhajiyimpanichchun - Jayashaali- Jayinchuchunna Vaaniki Vraayabadina Kroththanaama Munnatti Thella Raayinosanggi Vaani Bhayamu Tholaginchu Jayamu " 5. Nadipinchuchunde Nithyamu - Thana Drushti Nilipi Viduvakundaga Nee Prabhu - Kadavaraku - Nadipinchuchunde Nithyamu Edathegani Thanadu Prema - Kanuparachi Thrupthiparachi Chedugunellanu Baapi - Thana Yadugu Jaadalalo 6. Balamu Naaropinchumu - Balamichchu Prabhuvu - Siluvalo Neekai Samasenu - Seeyonu - Balamu Naaropinchumu Geliche Samaadhinundi - Balamutho Thirigileche Ella Melula Thalachi - Hallelooya Paadedamu