పరిశుద్ధ మందిరము నాకు నిర్మించ మంటిరి ప్రభువా - YouWorship
Parishuddha Mandiramu Naaku Nirmincha Mantiri Prabhuvaa
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: పరిశుద్ధ మందిరము నాకు (2) - నిర్మించ మంటిరి ప్రభువా (2) ఇశ్రాయేలు నివాసమొకటి ఏర్పరచ మంటిరి ప్రభువా (2) 1. తుమ్మ కర్రతో మందసమును (2)- జేసి బంగారును - పొదిగించిన (2) తుమ్మకర్ర మీరేయని యంటిరి (2) 2. కరుణాపీఠము కావెలెనంటిరి - కరుణాపీఠము నేనే యనుచు ప్రాణమిడితిరి కరుణను జూపి 3. బలిపీఠమును చేయుమంటిరి - బలిపీఠము నా సిలువయే యనుచు బలియైతిరి మీ రక్తము కార్చి (2) 4. ఆవరణ ద్వారంబుల జేసి - ముగించితిని మీ పనినంతటిని మహిమయు ఘనత మీకే కల్గున్ 5. నావన్నియును మీకిచ్చితిని - మీ వన్నియును నావే ప్రభువా కృప జూపితిరి మీ మహాప్రేమన్ 6. పరిశుద్ధ పట్టణమునందు - నివాస స్థలము నా కొసగితిరి తరతరములు మీతో నివసింతున్ Pallavi: Parishuddha Mandiramu Naaku (2) - Nirmincha Mantiri Prabhuvaa (2) Ishraayelu Nivaasamokati Erparacha Mantiri Prabhuvaa (2) 1. Thumma Karratho Mandasamunu (2)- Jesi Banggaarunu - Podiginchina (2) Thummakarra Meereyani Yantiri (2) 2. Karunaapeethamu Kaavelenantiri - Karunaapeethamu Nene Yanuchu Praanamidithiri Karunanu Joopi 3. Balipeethamunu Cheyumantiri - Balipeethamu Naa Siluvaye Yanuchu Baliyaithiri Mee Rakthamu Kaarchi (2) 4. Aavarana Dvaarambula Jesi - Muginchithini Mee Paninanthatini Mahimayu Ghanatha Meeke Kalgun 5. Naavanniyunu Meekichchithini - Mee Vanniyunu Naave Prabhuvaa Krupa Joopithiri Mee Mahaapreman 6. Parishuddha Pattanamunandu - Nivaasa Sthalamu Naa Kosagithiri Tharatharamulu Meetho Nivasinthun