పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము - YouWorship
Parishuddha Pattanamu Kroththa Yerooshalemu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము - పరము నుండి వచ్చుట చూచితిని (1) భర్త కొరకు అలంకరింపబడిన - పెండ్లి కుమార్తెగా చూచితిని (2) 1. సింహాసనమందు గొప్ప శబ్దముతో - బలముగ పలికిన స్వరము వింటిన్ (2) దేవుడు నివసించు మానవులతో తానే వారితో సదా వసించున్ (1) 2. దేవుడు తానే వారితో నుండి - ఆయన వారికి తండ్రియగును ప్రతి బాష్పబిందువుల తుడిచివేయున్ మరణము దుఃఖము ఏడ్పు నిక నుండదు 3. మొదటి సంగతులు గతించు చుండె - పరికించుము సర్వము క్రొత్తవాయె సింహాసన మందుండి ప్రభువే పలికె నూతనముగా నే చేసితి ననెను 4. ఈ వాక్యము విశ్వాసులకు యోగ్యము - సత్యమై మారనిదై యుండు నెప్పుడు ఆది యంతము అల్ఫా ఓమేగ దప్పి గొన్న వానికి జలము లిచ్చున్ 5. జయించువారు వీటన్నింటిని - వారసులై స్వతంత్రించు కొందురు ఆయన వారికి దేవుడై యుండి - వారాయనకు పుత్రులవుదురు Pallavi: Parishuddha Pattanamu Kroththa Yerooshalemu - Paramu Nundi Vachchuta Choochithini (1) Bhartha Koraku Alangkarimpabadina - Pendli Kumaarthegaa Choochithini (2) 1. Sinhaasanamandu Goppa Shabdamutho - Balamuga Palikina Svaramu Vintin (2) Devudu Nivasinchu Maanavulatho Thaane Vaaritho Sadaa Vasinchun (1) 2. Devudu Thaane Vaaritho Nundi - Aayana Vaariki Thandriyagunu Prathi Baashpabinduvula Thudichiveyun Maranamu Duhkhamu Edpu Nika Nundadu 3. Modati Sanggathulu Gathinchu Chunde - Parikinchumu Sarvamu Kroththavaaye Sinhaasana Mandundi Prabhuve Palike Noothanamugaa Ne Chesithi Nanenu 4. Ee Vaakyamu Vishvaasulaku Yogyamu - Sathyamai Maaranidai Yundu Neppudu Aadi Yanthamu Alphaa Omega Dappi Gonna Vaaniki Jalamu Lichchun 5. Jayinchuvaaru Veetannintini - Vaarasulai Svathanthrinchu Konduru Aayana Vaariki Devudai Yundi - Vaaraayanaku Puthrulavuduru