పరిశుద్ధులై యుండుడి దైవ చిత్తమున పెరుగుడి - YouWorship
Parishuddhalai Yundudi Daiva Chiththamuna Perugudi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: పరిశుద్ధులై యుండుడి దైవ చిత్తమున పెరుగుడి (1) యథార్దులై యుండుడి - పరిశుద్ధులై యుండుడి (1) 1. నడతలలో - వస్త్రములలో - ఆటంకము లేమియు లేకుండ (2) అడుగు ప్రశ్న జవాబులలో - విడువకజూపుము - పరిశుద్ధత (2) 2. పనులలోన ప్రతిస్థలమున - పరిశుద్ధ జీవిత మవసరము ప్రతిదారిన్ - ప్రతి సమయమున - పనులలో చూపుము - పరిశుద్ధత 3. ప్రేమ ఐక్యత పెరుగజేయున్ శ్రమ దుఃఖముల దూరపరచున్ ప్రియముతో నెల్లరు చేరి - పోరుమాని కోరుము - పరిశుద్ధత 4. దేవునిపోలిన జీవముఁజూప - కావలయును పావన జీవం జీవిత వేషంబు వ్యర్థము - కీడునుబాపును - పరిశుద్ధత 5. శుద్ధసాక్ష్యము - భద్రపరచును - ఇద్దరిణిలో సిద్ధపరచున్ శుద్ధమగు - చిత్తంబు కలుగు - నిత్య పవిత్రత నిడు - పరిశుద్ధత 6. నీతితోడ - జ్యోతియుండిన - లేదు కొఱత లేదు చూడన్ మేదినిపై నిలుచు శేషము - వాదమేమి నికలేదు - పరిశుద్ధత 7. ఇలను దేహమాత్మలందు - కల్మషంబు కానరాదు తెలుపగు తేటైన మచ్చలు - సిలువరక్తమున - పరిశుద్ధత Pallavi: Parishuddhalai Yundudi Daiva Chiththamuna Perugudi (1) Yathaardulai Yundudi - Parishuddhalai Yundudi (1) 1. Nadathalalo - Vasthramulalo - Aatangkamu Lemiyu Lekunda (2) Adugu Prashna Javaabulalo - Viduvakajoopumu - Parishuddhatha (2) 2. Panulalona Prathisthalamuna - Parishuddha Jeevitha Mavasaramu Prathidaarin - Prathi Samayamuna - Panulalo Choopumu - Parishuddhatha 3. Prema Aikyatha Perugajeyun Shrama Duhkhamula Dooraparachun Priyamutho Nellaru Cheri - Porumaani Korumu - Parishuddhatha 4. Devunipolina Jeevamunjoopa - Kaavalayunu Paavana Jeevan Jeevitha Veshambu Vyarthamu - Keedunubaapunu - Parishuddhatha 5. Shuddhasaakshyamu - Bhadraparachunu - Iddarinilo Siddhaparachun Shuddhamagu - Chiththambu Kalugu - Nithya Pavithratha Nidu - Parishuddhatha 6. Neethithoda - Jyothiyundina - Ledu Koratha Ledu Choodan Medinipai Niluchu Sheshamu - Vaadamemi Nikaledu - Parishuddhatha 7. Ilanu Dehamaathmalandu - Kalmashambu Kaanaraadu Thelupagu Thetaina Machchalu - Siluvarakthamuna - Parishuddhatha