పరిశుద్ధులెల్లరు యేసున్ పొగడి పాడి యార్భటించి పరముననుండ - YouWorship
Parishuddhalellaru Yesun Pogadi Paadi Yaarbhatinchi Paramunanunda
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. పరిశుద్ధులెల్లరు యేసున్ పొగడి - పాడి యార్భటించి పరముననుండ - పరమానంద గీతమచ్చట ధ్వనింప (1) నీ వచట నుందువా? (3) నా మానసమా! 2. గొఱ్ఱెపిల్లయు రాజ్యమేలుచుండ - నాశ్రితు లెల్లరు నాయనను చేర- మిత్రుడెల్ల కన్నీటి దుడుచుచుండ - నీ వచట నుందువా? - నా మానసమా! 3. పేతురు పౌలు యోహాను నచట - పితామహులు యపో స్తలులందరు- హతసాక్షులెల్లరు సమావేశింప - నీ వచట నుందువా?- నా మానసమా! 4. జగములో సిలువను మోసినచో - కిరీటము ధరియించి భాసిల్లుదురు- దేవ పుత్రులుగా నెల్లరు మారగా - నీ వచట నుందువా? నా మానసమా! 5. శోధనల జయించిన వీరులెల్ల - కష్టశ్రమలోర్చిన మహాత్ములు- జ్యోతిర్మయులుగా నొప్పారుచుండ - నీ వచట నుందువా? నా మానసమా! 6. కన్యకరణినాడు ప్రభుసంఘము - రాజు యేసు పెండ్లి కుమారునికి- భార్యగా ప్రకాశింప దాని రుచింప - నీ వచట నుందువా? నా మానసమా! నేనచట నుండెదను - నా యేసుతోడ 1. Parishuddhalellaru Yesun Pogadi - Paadi Yaarbhatinchi Paramunanunda - Paramaananda Geethamachchata Dhvanimpa (1) Nee Vachata Nunduvaa? (3) Naa Maanasamaa! 2. Gorrepillayu Raajyameluchunda - Naashrithu Lellaru Naayananu Chera- Mithrudella Kanneeti Duduchuchunda - Nee Vachata Nunduvaa? - Naa Maanasamaa! 3. Pethuru Paulu Yohaanu Nachata - Pithaamahulu Yapo Sthalulandaru- Hathasaakshulellaru Samaaveshimpa - Nee Vachata Nunduvaa?- Naa Maanasamaa! 4. Jagamulo Siluvanu Mosinacho - Kireetamu Dhariyinchi Bhaasilluduru- Deva Puthrulugaa Nellaru Maaragaa - Nee Vachata Nunduvaa? Naa Maanasamaa! 5. Shodhanala Jayinchina Veerulella - Kashtashramalorchina Mahaathmulu- Jyothirmayulugaa Noppaaruchunda - Nee Vachata Nunduvaa? Naa Maanasamaa! 6. Kanyakaraninaadu Prabhusangghamu - Raaju Yesu Pendli Kumaaruniki- Bhaaryagaa Prakaashimpa Daani Ruchimpa - Nee Vachata Nunduvaa? Naa Maanasamaa! Nenachata Nundedanu - Naa Yesuthoda