పరిశుద్ధుడవై - YouWorship
Parishuddhudavai
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
పరిశుద్ధుడవై – మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై – దీనుల పక్షమై కృప చూపు వాడవు (2) దయాళుడవై – ధారాళముగా నను దీవించిన శ్రీమంతుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడవై|| నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి (2) శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్ధనలు సఫలము చేసితివి ||ఆరాధన|| నీ నిత్యమైన ఆదరణ చూపి నను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నను ప్రేమించితివి (2) నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి ||ఆరాధన|| ఆనందకరమైన దేశములో నేను నిను ఘనపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి (2) మేఘ వాహనుడవై వచ్చుఁవరకు నే కనిపెట్టుచుందును నీ కోసము నీ దాసుల కాంక్షను సంపూర్ణ పరచెదవు ||ఆరాధన|| Parishuddhudavai – Mahima Prabhaavamulaku Neeve Paathrudavu Balavanthudavai – Deenula Pakshamai Krupa Choopu Vaadavu (2) Dayaaludavai – Dhaaraalamugaa Nanu Deevinchina Shreemanthudaa Aaraadhana Neeke Naa Yesayyaa Sthuthi Aaraadhana Neeke Naa Yesayyaa (2) ||Parishuddhudavai|| Nee Swaasthyamaina Nee Vaaritho Kalisi Ninu Sevinchutaku Nee Mahima Prabhaavamunu Kireetamugaa Dharimpajesithivi (2) Shaashwatha Kaalamu Varaku Nee Santhathipai Drushti Nilipi Nee Daasula Praardhanalu Saphalamu Chesithivi ||Aaraadhana|| Nee Nithyamaina Aadarana Choopi Nanu Sthiraparachutaku Nee Karunaa Kataakshamunu Naapai Kuripinchi Nanu Preminchithivi (2) Naaku Prayojanamu Kalugajeyutaku Nee Upadeshamunu Bodhinchi Nee Daasuni Praanamunu Santhoshaparachithivi ||Aaraadhana|| Aanandakaramaina Deshamulo Nenu Ninu Ghanaparachutaku Nee Mahimaathmatho Nimpi Surakshithamuga Nannu Nivasimpajesithivi (2) Megha Vaahanudavai Vachchuvaraku Ne Kanipettuchundunu Nee Kosamu Nee Daasula Kaankshanu Sampoorna Parachedavu ||Aaraadhana||