పరలోక పట్టణము - YouWorship
Paraloka Pattanamu
Artist: Unknown Artist
Category: Second Coming
Song Lyrics
పరలోక పట్టణము పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములతో పదిలముగా కట్టబడె (2) ||పరలోక|| మండితంబగు పునాది సూర్యకాంతపు రాయి (2) రెండవది నీలము మూడవది యమునా రాయి (2) ||పరలోక|| పచ్చ వైఢూర్యము కెంపు సువర్ణము (2) అచ్చ గోమేధికము పుష్య రాగము తోడ (2) ||పరలోక|| పదియవది సూనియము పదకొండు పద్మరాగము (2) పండ్రెండు సుగంధము పండ్రెండు ముత్యములు (2) ||పరలోక|| శుద్ధ సువర్ణ వీధుల్ స్వచ్ఛమైన స్ఫటికము (2) సుందరముగా నుండు సిద్ధపడి రండి (2) ||పరలోక|| గొఱ్ఱెపిల్ల దీపం సూర్యుడక్కరలేదు (2) భూరాజుల్ తమ మహిమన్ తీసికొని వచ్చెదరు (2) ||పరలోక|| జీవజలముల నది ప్రవహించు చుండెను (2) జీవంబు గల్గును జీవించుదురు ప్రజలు (2) ||పరలోక|| ఇరుప్రక్కల నదికి జీవ వృక్షముండె (2) పండ్రెండు నెలలకు పండ్రెండు కాపులు కాయు (2) ||పరలోక|| Paraloka Pattanamu Pandrendu Gummamulu Pandrendu Muthyamulatho Padilamugaa Kattabade (2) ||Paraloka|| Mandithambagu Punaadi Sooryakaanthapu Raayi (2) Rendavadi Neelamu Moodavadi Yamunaa Raayi (2) ||Paraloka|| Pachcha Vaidooryamu Kempu Suvarnamu (2) Achcha Gomedhikamu Pushya Raagamu Thoda (2) ||Paraloka|| Padiyavadi Sooniyamu Padakondu Padmaraagamu (2) Pandrendu Sugandhamu Pandrendu Muthyamulu (2) ||Paraloka|| Shuddha Suvarna Veedhul Swachchamaina Sphatikamu (2) Sundaramugaa Nundu Siddhapadi Randi (2) ||Paraloka|| Gorrepilla Deepam Sooryudakkaraledu (2) Bhooraajul Thama Mahiman Theesikoni Vachchedaru (2) ||Paraloka|| Jeevajalamula Nadi Pravahinchu Chundenu (2) Jeevambu Galgunu Jeevinchuduru Prajalu (2) ||Paraloka|| Iruprakkala Nadiki Jeeva Vrukshamunde (2) Pandrendu Nelalaku Pandrendu Kaapulu Kaayu (2) ||Paraloka||