పరలోకమే నా స్వాస్థ్యము - YouWorship
Paralokame Naa Swaasthyamu
Artist: Unknown Artist
Category: Hope
Song Lyrics
పరలోకమే నా స్వాస్థ్యము ఎపుడు గాంతునో (2) నా ప్రియ యేసుని నేనెపుడు గాంతునో (2) ||పరలోకమే|| ఆకలిదప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట (2) పరమ మకుటము పొందను ప్రభు పాదముల చేరెదను (2) ||పరలోకమే|| సిలువ వేయబడితిని ఇక నే కాదు జీవించుట (2) ప్రభు యేసు మహిమ కొరకు గురి గలిగి జీవింతును (2) ||పరలోకమే|| నా పరుగు తుద ముట్టింప నాకు కృపను మెండుగ నొసగును (2) విశ్వాస మార్గములో విసుగక పరుగెత్తెదను (2) ||పరలోకమే|| పరమ విశ్రాంతి పొంద పరలోకమందు చేరెదను (2) పగలు రాత్రచ్చట లేదు ప్రభువే దీపమై యుండును (2) ||పరలోకమే|| ప్రియుని పిలుపును విని నేను కూడా సిద్ధపడెదను (2) దినములు సమీపించగా వాంఛయు అధికంబాయె (2) ||పరలోకమే|| Paralokame Naa Swaasthyamu Epudu Gaanthuno (2) Naa Priya Yesuni Nenepudu Gaanthuno (2) ||Paralokame|| Aakalidappulu Dukhamu Manovedana Ledachchata (2) Parama Makutamu Pondanu Prabhu Paadamula Cheredanu (2) ||Paralokame|| Siluva VeyabaditHini Ika Nekaadu Jeevinchuta (2) Prabhu Yesu Mahima Koraku Guri Galigi Jeevinthunu (2) ||Paralokame|| Naa Parugu Thuda Muttimpa Naaku Krupanu Menduga Nosagunu (2) Vishwaasa Maargamulo Visugaka Parugetthedanu (2) ||Paralokame|| Parama Vishraanthi Ponda Paralokamandu Cheredanu (2) Pagalu Raathrachchata Ledu Prabhuve Deepamai Yundunu (2) ||Paralokame|| Priyuni Pilupunu Vini Nenu Kooda Siddhapadedanu (2) Dinamulu Sameepinchagaa Vaanchayu Adhikambaaye (2) ||Paralokame||