పరలోకము నా దేశము - YouWorship
Paralokamu Naa Deshamu
Artist: Unknown Artist
Category: Hope
Song Lyrics
పరలోకము నా దేశము పరదేశి నేనిల మాయలోకమేగ నేను యాత్రికుడను (2) ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము (2) ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును (2) ||పరలోకము|| దూతలు పాడుచుందురు పరమందున దీవా రాత్రమునందు పాడుచుందురు (2) పావనుని చూచి నేను హర్షింతును నిత్యము (2) ||పరలోకము|| రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్ వీక్షించెద నెప్పుడు నాదు ప్రియుని (2) కాంక్షించెద నా మదిలో ఆయన చెంతనుండ (2) ||పరలోకము|| అద్దరికి ఎప్పుడు నేను వెళ్లెదన్ అగుపడుచున్నది గమ్యస్థానము (2) అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరిన్ (2) ||పరలోకము|| నిత్యానందముండును పరమందున నీతి సమాధానము ఉండునచ్చట (2) పొందెదను విశ్రాంతిని శ్రమలన్నియు వీడి (2) ||పరలోకము|| Paralokamu Naa Deshamu Paradeshi Nenila Maayalokamega Nenu Yaathrikudanu (2) Entho Andamainadi Paralokamu Asamaanamainadi Naa Deshamu (2) Ellappudu Vishwaasamutho Yaathranu Saaginthunu (2) ||Paralokamu|| Doothalu Paaduchunduru Paramanduna Deevaa Raathramunandu Paaduchunduru (2) Paavanuni Choochi Nenu Harshinthunu Nithyamu (2) ||Paralokamu|| Rakshakuni Chenthaku Eppudegedan Veekshincheda Neppudu Naadu Priyuni (2) Kaankshincheda Naa Madilo Aayana Chenthanunda (2) ||Paralokamu|| Addariki Eppudu Nenu Velledan Agupaduchunnadi Gamyasthaanamu (2) Achchatane Choochedanu Parishuddhulellarin (2) ||Paralokamu|| Nithyaanandamundunu Paramanduna Neethi Samaadhaanamu Undu Nachchata (2) Pondedanu Vishraanthini Shramalanniyu Veedi (2) ||Paralokamu||