పరలోకమున నుండి దేవ - YouWorship
Paralokamuna Nundi Deva
Artist: పురుషోత్తము చౌదరి
Category: Praise & Worship
Song Lyrics
పరలోకమున నుండి దేవ - నీ పదముల కొనరింతు సేవ = దురితంబులకు నేను - వెరచి యున్నానని - కరుణించి నీ సుతుని - ధర కంపితివి గాదా = అరయగా నీ ప్రేమ యింతన - దరము గాదో పరమ జనక - మరణ పర్యంతంబు నిను నే - మరువ జాలను - వరకృపా నిధి ||పరలోక|| 1. యేసుక్రీస్తుని దయసేయ - కున్న - మోస మొందెద నెందుకన్న = దోసంబులకు నేను - దాసుండనై ప్రతి - వాసరంబును నీదు - భాసు రాజ్ఞలు విడిచి = వేసటలు గల నరకమున బడ - ద్రోసిన నది న్యాయమో గద - నా సునాధా పేరిమిచేతను - నీ సుతుని నంపించినావు ||పరలోక|| 2. ఎన్నరాని మహిమ నుండి - యేసు - నన్ను బాలింప నేటెంచి = యెన్న శక్యము గాక - యున్న పాపము లన్ని - చిన్నాభిన్నము జేసి = నన్ను సమ్మతిపరప - నన్ను యగు నా రక్షకుండు - తన్ను తానర్పించి వెండియు - నున్నతుండై లేచి యిపుడు - సన్నిధానం బొసగె నాకు ||పరలోక|| Paralokamuna Nundi Deva - Nee Padamula Konarinthu Seva = Durithambulaku Nenu - Verachi Yunnaanani - Karuninchi Nee Suthuni - Dhara Kampithivi Gaadaa = Arayagaa Nee Prema Yinthana - Daramu Gaado Parama Janaka - Marana Paryanthambu Ninu Ne - Maruva Jaalanu - Varakrupaa Nidhi ||Paraloka|| 1. Yesukreesthuni Dayaseya - Kunna - Mosa Mondeda Nendukanna = Dosambulaku Nenu - Daasundanai Prathi - Vaasarambunu Needu - Bhaasu Raagnalu Vidichi = Vesatalu Gala Narakamuna Bada - Drosina Nadi Nyaayamo Gada - Naa Sunaadhaa Perimichethanu - Nee Suthuni Nampinchinaavu ||Paraloka|| 2. Ennaraani Mahima Nundi - Yesu - Nannu Baalimpa Netenchi = Yenna Shakyamu Gaaka - Yunna Paapamu Lanni - Chinnaabhinnamu Jesi = Nannu Sammathiparapa - Nannu Yagu Naa Rakshakundu - Thannu Thaanarpinchi Vendiyu - Nunnathundai Lechi Yipudu - Sannidhaanan Bosage Naaku ||Paraloka||