పరమ వైద్యుండ భారతీయుల - YouWorship
Parama Vaidyunda Bhaaratheeyula
Artist: మల్లెల దావీదు
Category: Prayer
Song Lyrics
పరమ వైద్యుండ భారతీయుల - వ్యాధి బాధలం బాపుమా = పరుల కుపచారం బొనర్చుట - పరమ విధియని చూపుమా ||పరమ|| 1... ప్రేమతో వైద్యులును దాదులు - బొందంగజేయుమా = గ్రామ రోగులం గాంచి వారికి - క్షేమమును దయ చేయుమా ||పరమ|| 2. ఖండము నందు వైద్యపు - బడులను నెలకొల్పుమా = పరంగ నీవే వైద్య శాలలం - బాలనంబు సల్పుమా || పరమ|| 3. కుంటి గ్రుడ్డి మూంగ సాలలం -గూర్మితో దర్శించుమా = యంటు రోగుల యాశ్రయముల - నంటి పరామర్శించుమా || పరమ|| 4, లెక్కలేని గర్భవతుల - యక్కణలను దీర్చుమా = దిక్కు లేని బిడ్డలకు నీ - దీవెనల సమకూర్చుమా ||పరమ|| 5. యంత్రశాలల గనులయందు - నలయు వారలం = మంత్ర తంత్రము లందుం జిక్కు న- మాయకులను గావుమా || పరమ|| 6. గ్రామ వైద్య జేసెడి - ఘనులం బరిపాలించుమా = గ్రామవాసులం గూల్చు వ్యాధులం - గాంచి నిర్మూలించుమా 1పరమ|| 7. _ దురభిమాన మూఢ భక్తిని - ద్వరగ దూర పరచుమా = మరియు శుచిచే రోగములు మటు - మాయ మగు నని కరపుమా ||పరమ|| 8. _ దేహశుద్ధిని జిత్తశుద్ధిని దేశ జనులకుం గూర్చుమా = దేహములం బర శుద్ధ మగు నీ - దేవళములుగ మార్చుమా ||పరమ|| Parama Vaidyunda Bhaaratheeyula - Vyaadhi Baadhalan Baapumaa = Parula Kupachaaran Bonarchuta - Parama Vidhiyani Choopumaa ||Parama|| 1... Prematho Vaidyulunu Daadulu - Bondanggajeyumaa = Graama Rogulan Gaanchi Vaariki - Kshemamunu Daya Cheyumaa ||Parama|| 2. Khandamu Nandu Vaidyapu - Badulanu Nelakolpumaa = Parangga Neeve Vaidya Shaalalan - Baalanambu Salpumaa || Parama|| 3. Kunti Gruddi Moongga Saalalan -Goormitho Darshinchumaa = Yantu Rogula Yaashrayamula - Nanti Paraamarshinchumaa || Parama|| 4, Lekkaleni Garbhavathula - Yakkanalanu Deerchumaa = Dikku Leni Biddalaku Nee - Deevenala Samakoorchumaa ||Parama|| 5. Yanthrashaalala Ganulayandu - Nalayu Vaaralan = Manthra Thanthramu Landun Jikku Na- Maayakulanu Gaavumaa || Parama|| 6. Graama Vaidya Jesedi - Ghanulan Baripaalinchumaa = Graamavaasulan Goolchu Vyaadhulan - Gaanchi Nirmoolinchumaa 1Parama|| 7. _ Durabhimaana Moodha Bhakthini - Dvaraga Doora Parachumaa = Mariyu Shuchiche Rogamulu Matu - Maaya Magu Nani Karapumaa ||Parama|| 8. _ Dehashuddhini Jiththashuddhini Desha Janulakun Goorchumaa = Dehamulan Bara Shuddha Magu Nee - Devalamuluga Maarchumaa ||Parama||