పరమ దైవమే - YouWorship
Parama Daivame
Artist: ఏ ఆర్ స్టీవెన్సన్
Category: Christmas
Song Lyrics
యేసు పుట్టుకలోని పరమార్ధాన్ని గ్రహించి తిరిగి జన్మిస్తే ఆయన కొరకు జీవించగలం ఆయనను మనలో చూపించగలం పరమ దైవమే మనుష్య రూపమై ఉదయించెను నా కోసమే అమర జీవమే నరుల కోసమై దిగి వచ్చెను ఈ లోకమే క్రీస్తు పుట్టెను – హల్లెలూయ క్రీస్తు పుట్టెను – హల్లెలూయ క్రీస్తు పుట్టెను – హల్లెలూయా (2) ||పరమ దైవమే|| ఆకార రహితుడు ఆత్మ స్వరూపుడు శరీరమును ధరించెను సర్వాధికారుడు బలాఢ్య ధీరుడు దీనత్వమును వరించెను వైభవమును విడిచెను – దాసునిగను మారెను – (2) దీవెన భువికి తెచ్చెను – ముక్తి బాటగా… ||పరమ దైవమే|| అనాది వాక్యమే కృపా సమేతమై ధరపై కాలు మోపెను ఆ నీతి తేజమే నరావతారమై శిశువై జననమాయెను పాపి జతను కోరెను – రిక్తుడు తానాయెను (2) భూలోకమును చేరెను – యేసు రాజుగా… ||పరమ దైవమే|| నిత్యుడు తండ్రియే విమోచనార్ధమై కుమారుడై జనించెను సత్య స్వరూపియే రక్షణ ధ్యేయమై రాజ్యమునే భరించెను మధ్య గోడ కూల్చను – సంధిని సమకూర్చను – (2) సఖ్యత నిలుప వచ్చెను – శాంతి దూతగా… ||పరమ దైవమే|| Yesu Puttukoloni Paramaardhaanni Grahinchi Thirigi Janmisthe Aayana Koraku Jeevinchagalam Aayananu Manalo Choopinchagalam Parama Daivame Manushya Roopamai Udayinchenu Naa Kosame Amara Jeevame Narula Kosamai Digi Vachchenu Ee Lokame Kreesthu Puttenu – Hallelooya Kreesthu Puttenu – Hallelooya Kreesthu Puttenu – Hallelooyaa (2) ||Parama Daivame|| Aakaara Rahithudu Aathma Swaroopudu Shareeramunu Dharinchenu Sarvaadhikaarudu Balaadya Dheerudu Deenathvamunu Varinchenu Vaibhavamunu Vidichenu – Daasuniganu Maarenu – (2) Deevena Bhuviki Thechchenu – Mukthi Baatagaa… ||Parama Daivame|| Anaadi Vaakyame Krupaa Samethamai Dharapai Kaalu Mopenu Aa Neethi Thejame Naraavathaaramai Shishuvai Jananamaayenu Paapi Jathanu Korenu – Rikthudu Thaanaayenu (2) Bhoolokamunu Cherenu – Yesu Raajugaa… ||Parama Daivame|| Nithyudu Thandriye Vimochanaardhamai Kumaarudai Janinchenu Sathya Swaroopiye Rakshana Dhyeyamai Raajyamune Bharinchenu Madhya Goda Koolchanu – Sandhini Samakoorchanu – (2) Sakhyatha Nilupa Vachchenu – Shaanthi Doothagaa… ||Parama Daivame||