పరమపురి కల్పభూజ - YouWorship
Paramapuri Kalpabhooja
Artist: పాలవర్తి యాకోబు
Category: Worship
Song Lyrics
పరమపురి కల్పభూజ - నిరత భూనరుల పూజ యురుతరచిత మహిమతేజ - వరస్తుతి సల్పెదము రాజ ||పరమ|| 1. జనక సుత శుద్ధాత్మ - యను పేరిట యీ క్షణ ఘనతర సంరక్ష ప్రేమ - ననిపి మము కనికరించు ||పరమ|| 2. నీవే మా ప్రాపువంచు - నెరనమ్మి యుందు మంచు భావంబున దలంచు వారిం - బావనులం జేయు సదా ||పరమ|| 3. కలుషంబులను హరింప - నిల సైతానును జయింప బలుమారు నిను దలంచు - బలము గల ప్రభుండ వీవే ||పరమ|| 4. ఈ లోక పాపనరులు - చాల నిను నమ్మి మరల దూలిచే దారుణ సైతానును బడంద్రొక్కివేయు ||పరమ|| 5. అల్ఫా ఓ మేగయును - నాద్యంతంబులును కల్పాంత స్థాయువైన - కర్తా కరుణించు మమును ||పరమ|| Paramapuri Kalpabhooja - Niratha Bhoonarula Pooja Yurutharachitha Mahimatheja - VaraSthuthi Salpedamu Raaja ||Parama|| 1. Janaka Sutha Shuddhaathma - Yanu Perita Yee Kshana Ghanathara Sanraksha Prema - Nanipi Mamu Kanikarinchu ||Parama|| 2. Neeve Maa Praapuvanchu - Neranammi Yundu Manchu Bhaavambuna Dalanchu Vaarin - Baavanulan Jeyu Sadaa ||Parama|| 3. Kalushambulanu Harimpa - Nila Saithaanunu Jayimpa Balumaaru Ninu Dalanchu - Balamu Gala Prabhunda Veeve ||Parama|| 4. Ee Loka Paapanarulu - Chaala Ninu Nammi Marala Dooliche Daaruna Saithaanunu Badandrokkiveyu ||Parama|| 5. Alphaa O Megayunu - Naadyanthambulunu Kalpaantha Sthaayuvaina - Karthaa Karuninchu Mamunu ||Parama||